SIR ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అప్రమత్తంగా ఉండాలి

0
7

ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియ సాగేలా చూడాలి

ఉప్పల్ నియోజకవర్గంలో SIR పై BLA లకు అవగాహన సదస్సు

హాజరైన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ,జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ ,ఉప్పల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఇందిర శోభన్ ,నియోజకవర్గం ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి

ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

ఓటరు జాబితాల సవరణ ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమన్నారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.

ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని BLA లకు SIR పై అవగాహన కార్యక్రమం జరిగింది.

ఉప్పల్ భగాయత్ లోని శ్రీ రస్తు ఫంక్షన్ హాల్ లో పరమేశ్వర్ రెడ్డి జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు ఇంచార్జ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, ఇందిర శోభన్ గారు తదితరులు పాల్గొని మాట్లాడారు.

SIR ప్రక్రియ అమలులో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని అన్నారు. నిజమైన ఓటర్ల పేర్లు పొరపాటున తొలగించబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఓటర్లకు సైతం అవసరమైన అవగాహన కల్పించి, ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలన్నారు.

ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి బయటపడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితాలు అవసరమని, ఎన్నికల సంఘం చేపడుతున్న SIR ప్రక్రియ ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో BLA లు,ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు,జిల్లా కార్యవర్గ సభ్యులు,పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here