వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలి

0
131
Vadderas should be included in STs.
Vadderas should be included in STs.

.

  • అఖిల భారత వడ్డెర వడ్డెర సంక్షేమ సేవా సంఘం డిమాండ్
  • సామాజిక వర్గ అభ్యున్నతికి నిరంతరం పాటు పడదాం

హైదరాబాద్, సెప్టెంబర్ 13 : వడ్డెర సామాజిక వర్గం ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించుకుంటూ అభ్యున్నతికి పాటుపడదామని అఖిలభారతం వడ్డెర వడ్డే సంక్షేమ సేవా సంఘం జాతీయ అధ్యక్షులు వేముల లక్ష్మణ్ పిలుపునిచ్చారు. వడ్డెర సంఘాన్ని బలోపేతం చేసేందుకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన ప్రకటించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి గా గుంజా శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా అశోక్, జాతీయ సంయుక్త కార్యదర్శిగా మొక్కల శేఖర్, యువజన అధ్యక్షుడిగా డాక్టర్ వేముల లోకేష్, యువజన కార్యదర్శిగా డాక్టర్ వేముల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శిగా వేముల మధుసూదన్ లను నియమించినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో ఉన్న వడ్డెరలను ఐక్యం చేసి సామాజిక వర్గం సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామని అన్నారు. పేదరికంలో మగ్గుతున్న వడ్డెరలను సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా అన్ని రంగాలలో అభివృద్ధికి కృషి చేసేందుకు కార్యవర్గం శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. తమ కులాన్ని ఎస్టీల్లో చేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. అన్ని రంగాల్లో వెనుకబడిన వడ్డెర్లను ఎస్టీల్లో చేర్చాలని మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం నుంచి కోరుతున్నామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని తమ సంచార
జాతులను ఎస్టీల్లో చేర్చాలని ఆయన కోరారు. అలాగే క్వారీ లీజుల్లో ప్రభుత్వం 50 శాతం వడ్డెర్లకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వడ్డెర విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, వడ్డెర్ల ఆర్థిక అభివృద్ధికి వడ్డెర కార్పొరేషన్‌ ఏర్పాటు ఆ వర్కుల్లో ఈఎండీ లేకుండా రూ. 5 కోట్ల వరకూ వడ్డెర్లకు ఇవ్వాలని
కోరారు. ఈ అంశాలపై వడ్డెర్లలో అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తాము పర్యటించనున్నట్టు తెలిపారు. అతిత్వరలో తమను ఎస్టీల్లో చేర్చాలని, లేకుంటే రోడ్లపై వంటా వార్పు కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వడ్డెర కులస్థులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పిందని. వారికి మైనింగ్‌లో భారీగా కేటాయింపులు, సబ్సిడీలు, రాయితీలు అందించనున్నట్లు వెల్లడించారు. మైనింగ్ లీజుల్లో రిజర్వేషన్లు, సీనరేజు ఫీజులో సబ్సిడీ, క్వారీలో ఉపయోగించే మిషన్ల కొనుగోలుకు సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. మొట్టమొదటిసారిగా క్వారీ లీజుల్లో వడ్డెరలకు రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.