చత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ :సి ఎస్ చవాన్
హైదరాబాద్ , మా భూమి టైమ్స్, ఏప్రిల్ 26: రాజా శివాజీ సినిమా పేరులో ఛత్రపతి చేర్చాలని చత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ సి ఎస్ చవాన్ డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ మీడియా సమావేశంలో చత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ మాట్లాడుతూ రాజా శివాజీ సినిమా పేరులో చత్రపతి చేర్చాలని డిమాండ్ చేశారు. మే 1న విడుదలకు సిద్ధమైన బాలీవుడ్ చిత్రం రాజా శివాజీ పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సీఎస్ చవాన్ ఈ చిత్రం నిర్మాతలు రితేష్ జెలీనియా పై చర్యలు తీసుకోవాలని కోరారు. చత్రపతి అనే గౌరవ ప్రదమైన బిరుదును తీసివేయడం అనేది అంగీకార యోగ్యం కాదనీ ఇది శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ గౌరవం చారిత్ర చారిత్రిక ప్రాముఖ్యతను తగ్గించే చర్యగా భావిస్తున్నామని అన్నారు. సినిమా విడుదలకు ముందే వెంటనే టైటిల్లో మార్పులు చేయాలని అధికారికంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఎస్ చవాన్ నిర్మాతలకు కొన్ని డిమాండ్లు ప్రతిపాదించారు. సినిమా పేరులో చత్రపతి చేర్చాలి శ్రీ శివాజీ మహారాజ్ గౌరవమైన నిజమైన ప్రతినిధిత్యాన్ని నిర్ధారించాలనీ ఈ విషయంలో నిర్మాతలు సంబంధిత అధికారులు నుంచి తక్షణమే స్పందించాలని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే పౌండేషన్ చట్ట పరమైన చర్యలకు దిగాల్సి వస్తుందని స్పష్టంగా తెలియజేసింది
తక్షణ చర్యలు తీసుకోకపోతే సినిమా విడుదలకు నిలిపివేయడానికి ముంబాయి హైకోర్టును ఆశ్రయిస్తూ స్టే కోసం పిటిషన్ దాఖలు చేయడం వంటి చట్టపర మైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ సినిమాకి సంబంధించిన నిర్మాతలుగా రితేష్ జెనీలియా దేశ్ ముఖ్ బాధ్యతాయుతంగా వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సి ఎస్ చవాన్ వ్యవస్థాపకుడు చైర్మన్ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్, నాగ బాల, సురేష్ కుమార్, మదన గుప్తా, జగన్మోహన్, జడ్డు యాదవ్, నితిన్, నందకర్, సూర్య కుమార్, ప్రవీణ్ దుబే, రమేష్ నందికొండ, వైభవ్ సూర్య, అనంతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు






