‘సుగ్రీవ’ ట్రైలర్ రిలీజ్.. ఏప్రిల్ 24న చిత్రం విడుదల

0
98
'Sugreeva' trailer is out.. The film will be released on April 24th.
'Sugreeva' trailer is out.. The film will be released on April 24th.

ఎస్ జి ఎస్ వి మూవీస్ పతాకంపై బాలు చరణ్, కాజల్ తివారి హీరో హీరోయిన్ గా నర్తు చిరంజీవి దర్శకత్వం లో ఎమ్ పవన్ కుమార్ నిర్మిస్తున్న సస్పెన్స్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “సుగ్రీవ”. ఈరోజు ఈ చిత్రం ట్రైలర్ ని సోషల్ మీడియా లో విడుదల చేసారు. అని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని ఏప్రిల్ 24 న రెండు తెలుగు రాష్ట్రలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ “సుగ్రీవ” ఒక అందమైన కుటుంబ కథ చిత్రం. ఆనందంగా జీవిస్తున్న కుటుంబం లో అనుకోని సంఘటనలు ఎదురైతే ఆ కుటుంబం ఎలాంటి పరిణామాలు ఎదురుకుంటుంది, వాళ్ళు ఆ సమస్యలు ఎలా ఎదుర్కున్నారు అనేదే కథ. ఈరోజు మా చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేసాం. సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాత ఎమ్ పవన్ కుమార్ గారు ఎక్కడ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. నర్తు చిరంజీవి గారి దర్శకత్వం అద్భుతంగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి, గోవా మరియు వైజాగ్ లాంటి అద్భుతమైన లొకేషన్స్ లో పాటలు చిత్రీకరించారు. సారధి స్టూడియోస్ లో డి ఐ జరిగింది. అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 24 న విడుదలకు సిద్ధంగా ఉంది” అని తెలిపారు. 

నటి నటులు: బాలు చరణ్, కాజల్ తివారి, సాయి కృప, సుమన్ శెట్టి, ఆర్ ఎక్స్ 100 కరణ్ విజయ్, గగన గీతికా, అల్పురి సునీల్, వంశీ కోడలి మరియు తదితరులు
చిత్రం పేరు: సుగ్రీవ
బ్యానర్: ఎస్ జి ఎస్ వి మూవీస్
రచన, దర్శకత్వం: నర్తు చిరంజీవి
నిర్మాత: ఎమ్ పవన్ కుమార్
సంగీతం: అజయ్ పట్నాయక్, విజయ్ కూరాకుల 
లిరిక్స్: రంజిత్ కుమార్ రీకీ
సినిమాటోగ్రఫీ: లక్కీ ఏకరీ
కోరియోగ్రఫీ: సునీల్ మాస్టర్, సాగర్ మాస్టర్ 
ఎడిటర్: బాబీ కడలి
పిఆర్ఓ: పాల్ పవన్