పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతుల ధర్నా…
25 గ్రామాలకు చెందిన 2500 మంది రైతులకు సంబంధించిన 250 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ సంస్థ…
కుషాయిగూడ సుభాష్ నగర్ లో ఉంటున్న నిందితుడు ధనుంజయ్ గుప్తా ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగిన రైతులు…
బాధితులకు అండగా పాశం యాదగిరి సంఘీభావం, మాకు న్యాయం చేయాలని డిమాండ్…
పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కింద నాగర్ కర్నూల్, కొల్హాపూర్ కు చెందిన భూమి కోల్పోయిన రైతులకు సంబంధించిన సుమారు 250 కోట్లు కొట్టేసిన ఘటన సంచలనం సృష్టించింది… ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ పేరుతో ఇట్యాల సాయిబాబా అనే ప్రధాన నిందితుడు ఇట్యాల ధనుంజయ్, ఇట్యాల బాలీశ్వర్, ఇట్యాల తుకారాం, నాగం కరుణాకర్ రెడ్డి, నాగం బుచ్చిరెడ్డి, రెవెల్లి జానకిరామ్ రెడ్డి, తాడురి శ్రీనివాస్ అనే వ్యక్తులతో కలిసి 250 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బాధిత రైతులు ఆరోపించారు. తక్కువ ధరలో భూములు ఇప్పిస్తానని, మంచి వడ్డీ ఇస్తామని నమ్మబలికి దాదాపు 25 గ్రామాలకు చెందిన 3000 మంది భూనిర్వాసితులు, రైతులకు సంబంధించిన సుమారు 250 కోట్ల నష్ట పరిహారం డబ్బులు కొల్లగొట్టారు. ఘరానా దొంగల చేతిలో మోసపోయాని గ్రహించిన రైతులు హై కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిందితుల ఆస్తులు జప్తు చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ధనుంజయ్ గుప్తా అనే నిందితుడు హైదరాబాద్ కుషాయిగూడ సుభాష్ నగర్ కాలనీలో ఉంటాడని తెలుసుకుని మంగళవారం 25 గ్రామాలకు చెందిన సుమారు 300 మంది బాధితులు నిందితుడి ఇంటిముందు బైఠాయించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా పాశం యాదగిరి నిలిచారు. ఆయన మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని ఆర్.అండ్.ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని చట్టం ఉన్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని పాశం యాదగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనుంజయ్ గుప్తా అనే నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి నిందితులను సంఘ బహిష్కరణ చేసి కాలనీ నుండి తరిమికొట్టాలని, సమాజం నుండి వెలివేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఫౌరసమాజం నిలబడి అన్నివిధాలుగా న్యాయం చేయాలని అందరినీ మేలు కోల్పాలని పాశం యాదగిరి పిలుపునిచ్చారు.
బైట్:- బాధితులు.
బైట్:- పాశం యాదగిరి.




