కల్లూరి మల్లేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
ఆలేరు : గురువారం రోజున ఆలేరులో నాలుగో వార్డ్ సిపిఎం అభ్యర్థి మోరిగాడి భాగ్యలక్ష్మి గెలుపును కోరుతూ మహాలక్ష్మి రైస్ మిల్ జంగాల కాలనీ ఆదర్శ్ నగర్ కాలనీలలో సిపిఎం నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం గారు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిని రానున్న మున్సిపల్ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన వారు ప్రజల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించే అభ్యర్థులను గెలిపించుకోవడం వలన ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పాలకవర్గంలో ప్రజా గొంతుకగా పనిచేస్తారని అలా కాకుండా ధన రాజకీయాలకు ప్రలోభాలకు లోనైతే ప్రజా కంటక పాలకులను ఐదు సంవత్సరాలపాటు ప్రజలు భరించవలసి వస్తుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు గత పాలకవర్గంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోయాయని ఆలేరు పట్టణంలో మురుగు కాలువల నిర్మాణం సీసీ రోడ్డు నిర్మాణం కమ్యూనిటీ హాల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకవర్గం విఫలమైందని ఐదు సంవత్సరాల కాలంలో కనీసం చెత్త డంపింగ్ యార్డ్ ను సైతం ఏర్పాటు చేసుకోవాలని దీన వ్యవస్థలో మున్సిపల్ వర్గం గడిచిపోయిందని అన్నారు రాబోయే పాలవర్గంలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రజా సమస్యలపై నిరంతరం పాలకవర్గాన్ని నియదీసి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్ మోరీగాడి రమేష్ జూకంటి పౌలు వడ్డేమాన్ బాలరాజు మోరిగాడి మహేష్ ఘనగాని మల్లేష్ బొప్పిరి యాదగిరి చెనవడ్డేమాన్ మోరిగాడి అజయ్ మోరిగాడి భాగ్యలక్ష్మి మొరిగాడి మొరిగాడి పుష్ప మద్దెల కుమార్ యాసారపు ప్రసాద్ మురిగాడి అంజయ్య గొడుగు దాసు మోరిగాడి అనిత శ్రీమాన్ బాబు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు





