నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో యువ న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలి : ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

0
86
Young lawyers should play a key role in building a society with moral values: MLA Mal Reddy Ranga Reddy
Young lawyers should play a key role in building a society with moral values: MLA Mal Reddy Ranga Reddy

హైదరాబాద్, మాభూమి టైమ్స్, జూన్ 5: ఆధునిక డిజిటల్ యుగంలో న్యాయ వ్యవస్థలోని మార్పులను అందిపుచ్చుకుంటూ నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో యువన్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో “సాధ్యం లా ప్రొఫెషనల్ అకాడమీ”ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక డిజిటల్ యుగంలో న్యాయ వ్యవస్థలోని మార్పులను అందిపుచ్చుకుంటూ, నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో యువన్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. నిర్వహకులు, ఫౌండర్, సాధ్యం లా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మునగ సతీష్ మాట్లాడుతూ చదువును వ్యాపారంగా కాకుండా సేవగా భావించి నాణ్యమైన విద్యను అందించాలనేదే మా సంకల్పం అని అన్నారు. అకాడమీ లో కల్పించిన వసతులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని చైర్మన్ మునగ సతీష్ శాలువాతో ఘనంగా సన్మానించారు.