ఎన్టీఆర్ కమిటీలో అట్లూరి అశ్విన్ పాత్ర అనిర్వచనీయం : టి.డి జనార్ధన్

0
12
Atluri Ashwin's role in the NTR Committee is indescribable: T.D. Janardhan
Atluri Ashwin's role in the NTR Committee is indescribable: T.D. Janardhan

ఎన్టీఆర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో మా కమిటీ ఉపాధ్యక్షులు అట్లూరి అశ్విన్ పాత్ర ఎంతో ఉందని, ఆయన అమెరికాలో ఉంటూ విదేశాల్లో వున్న అన్న ఎన్టీఆర్ అభిమానులను సమన్వయం చేసి సమావేశాలు ఏర్పాటు చేశారని చైర్మన్ టి.డి జనార్ధన్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ హైద్రాబాద్ లో శుక్రవారం అట్లూరి అశ్విన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది . పుట్టినరోజు సందర్భంగా అశ్విన్ కేక్ కట్ చేశారు . ఈ సందర్భంగా అశ్విన్ ను జనార్ధన్, రామకృష్ణ , ఇతర కమిటీ సభ్యులు ఆత్మీయంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చైర్మన్ టి.డి జనార్ధన్ మాట్లాడుతూ.. అన్న ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కమిటీలో అమెరికాలో వున్న అట్లూరి అశ్విన్ గారిని ఉపాధ్యక్షులుగా ఎంపిక చేశామని, ఎన్నో దేశాల్లో వున్న అన్నగారి అభిమానులను ఏకం చేసి , ప్రతి దేశంలోనూ సమావేశాలు నిర్వహించి రామారావు గారి స్మృతులను విశ్వవ్యాప్తం చేయడంలో ఆయన నిర్వహించిన పాత్ర అనన్య సామాన్యమని చెప్పారు . అశ్విన్ గారు భారత దేశం రావడం , వారి జన్మదినోత్సవాన్ని కమిటీ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని జనార్ధన్ పేర్కొన్నారు .

ఎన్టీఆర్ కమిటీ సలహాదారు ఎన్.టి.ఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ … నేను.. జనార్దన్ గారు ఎన్నో దేశాల్లో పర్యటించి నాన్న గారి భావజాలాన్ని అక్కడి అభిమానులతో పంచుకోవడంలో అశ్విన్ సహాయాన్ని మరిచిపోలేమని , మాతో పాటు ఆయన కూడా వచ్చి పర్యటనను విజయవంతం చేశారని చెప్పారు . అశ్విన్ గారికి నాన్న గారన్నా, బావ చంద్ర బాబు గారన్నా ఎంతో అభిమానమన , నాన్న గారిని మళ్ళీ ఈ తరానికి గుర్తు చేయడంలోనూ , తెలుగు దేశం పార్టీకి వెన్ను దన్నుగా వుండటంలోనూ ఆయన కీలకమైన పాత్ర పోషించారని రామ కృష్ణ ప్రశంసించారు .

మరో ఉపాధ్యక్షుడు రావుల చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ … అశ్విన్ గారు నిబద్దత కలిగిన అభిమాని , అన్న ఎన్ .టి .ఆర్ కమిటీలో ఆయన క్రియాశీలకంగా పాత్ర పోషించారు . మా అందరికీ ఇష్టమైన వ్యక్తి అశ్విన్ గారు. ఆయన పుట్టిన రోజు వేడుకను మా కమిటీ జరపడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు .

ఈ సందర్భంగా అట్లూరి అశ్విన్ మాట్లాడుతూ .. ఈ రోజు ఉదయమే తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నా , సాయంత్రం నా జన్మదినోత్సవాన్ని మా కమిటీ ఆత్మీయంగా జరపడం ఎంతో ఆనందంగా ఉందని , జీవితంలో మర్చిపోలేని, మధురమైన అనుభవంగా మిగిలిపోతుందని చెప్పారు , జనార్దన్ గారు ఈ కమిటీని ఏ లక్ష్యం తో ప్రారంభించారో , అది సంపూర్ణంగా నెరవేరిందని తానూ భావిస్తున్నానని, కమిటీలో సభ్యుడుగా ఉన్నందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు .

ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు భగీరథ , కళారత్న బిక్కి కృష్ణ, జల్ది విద్యాధర్, రాంబాబు , ప్రకాశం, హను ,సాయి జ్యోతి పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here