కార్పొరేటు కళాశాలల పీజుల దోపిడీని అరికట్టి చర్య తీసుకోవాలి
మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి వినతి పత్రం:
TNSF రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్
TDP మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికుంట అశోక్
మా భూమి టైమ్స్ వెబ్ డెస్క్:
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు,కార్పోరేట్ జూనియర్ కళాశాలల దోపిడీని అరికట్టాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరిగింది.
ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికుంట అశోక్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రైవేటు,కార్పొరేటు కళాశాలలు,అకాడమీల పేరుతో విచ్చలవిడిగా ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయని,ఇంటర్ విద్యకే లక్షల రూపాయలను చెల్లించే పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఫీజులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ ఆందోళన నిర్వహించడం జరిగింది.కార్పొరేట్ కళాశాలలో గత సంవత్సరం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం జరిగిందని, అయినప్పటికీ ఇంతవరకు వాటిపైన చర్యలు తీసుకోలేదని అన్నారు.
ప్రభుత్వ కళాశాలలో మౌలిక సదుపాయాలు లేని కారణంగానే తల్లిదండ్రులు ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల వైపు మొగ్గుచూపడం జరుగుతుందని ఈ ప్రభుత్వం వెంటనే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని అన్నారు.గెస్ట్ అధ్యాపకులను జూనియర్ కళాశాలలో ప్రారంభమైన నెల తర్వాత నియమించడం వలన ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులు ప్రైవేటు కళాశాలలను వెళ్లడం జరుగుతుందని శాశ్వత ప్రాతిపదికన జూనియర్ అధ్యాపకుల నియామకాలు జరపాలని అన్నారు.
నీట్ ఎంసెట్ ఐఐటి శిక్షణల పేరుతో 2 లక్షల నుండి 5 లక్షల రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నారని, అకాడమీల పేరుతో కోచింగ్ సెంటర్ల ఏర్పాటుచేసి అడ్మిషన్లు ఒకచోట తరగతులు ఒకచోట నిర్వహిస్తూ తల్లిదండ్రులను విద్యార్థులను మోసం చేస్తున్నారని అన్నారు.అధికారులు వెంటనే ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని నిబంధనలు పాటించని కళాశాలలో గుర్తింపు రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. అనంతరం మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానంద్ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు సురేష్ గుప్తా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరికృష్ణ, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌట గణేష్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి పృథ్వి చౌహాన్, టిఎన్ఎస్ఎఫ్ మల్కాజ్గిరి నాయకులు శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు..