
భారతీయ శాస్త్రీయ నృత్య కళలో అరుదైన ప్రతిభను కనబరుస్తున్న ఆరేళ్ల బాలనర్తకి ఆర్యాహి గిల్లెల అంతర్జాతీయ స్థాయిలో మరో విశిష్ట ఘనత సాధించేందుకు సిద్ధమైంది. నాట్యశాస్త్రంలో మహర్షి భరతుడు వివరించిన 108 నటరాజ కరణాలను నిరంతరాయంగా ప్రదర్శిస్తూ ఏకకాలంలో ఆరు అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పే లక్ష్యంతో హైదరాబాద్లోని రవీంద్రభారతి వేదికగా అద్భుత నృత్య ప్రదర్శన ఇచ్చింది.భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయానికి మూలాధారంగా గుర్తింపు పొందిన 108 కరణాలను కేవలం 10.8 నిమిషాల వ్యవధిలో ప్రదర్శించడం ద్వారా ఆర్యాహి తన అసాధారణ ప్రతిభను చాటుకుంది. ప్రతి కరణానికి సంబంధించిన శిల్పనామాలను సంగీతానికి అనుగుణంగా ఉచ్చరిస్తూ, కాళ్ల కదలికలు, హస్తముద్రలు, శరీర సమన్వయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.ఈ ప్రదర్శన కోసం ప్రత్యేకంగా రూపొందించిన “అదేనమ్మ హరుడు” సంగీత రూపకం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ సంగీతం, భరతముని శ్లోకాల సమ్మేళనంగా రూపొందిన ఈ సంగీతానికిఅనుగుణంగా ఆర్యాహి తన నృత్య ప్రదర్శనను ఆవిష్కరించింది. సుమారు ఆరు నెలలపాటు కఠిన సాధన చేసి ఈ ప్రదర్శనకు సిద్ధమైన ఆమె చిన్న వయస్సులోనే అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించడం విశేషం. శారద కళాక్షేత్రం మరియు భావనాస్ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాభిమానులు, నృత్యాచార్యులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారి ప్రతిభను అభినందించారు. చిన్ననాటి నుంచే నృత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆర్యాహి, ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి దేవరకద్ర, దైవజ్ఞ శర్మ సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రభ సత్యం ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు





