ఉప్పల్‌లో రైజర్స్‌ గర్జన.. చెన్నైపై హైదరాబాద్‌ విజయం!

0
134
Risers roar in Uppal.. Hyderabad wins over Chennai!
Risers roar in Uppal.. Hyderabad wins over Chennai!

ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 10 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (22 బంతుల్లో 59) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడుగా, హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 59) అర్ధ సెంచరీతో రాణించడంతో హైదరాబాద్ పటిష్ట స్థితికి చేరుకుంది. ట్రావిస్ హెడ్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో జేమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. చెన్నై బ్యాటర్లలో మ్యాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఆయుష్ మాత్రే (30) ధాటిగా ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. సర్ఫరాజ్ ఖాన్ (25), శివం దూబే (21) చివర్లో ప్రయత్నించినప్పటికీ హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. రుతురాజ్ గైక్వాడ్ (19), సంజు శాంసన్ (7) నిరాశపరిచారు. హైదరాబాద్ బౌలర్లలో ఎషాన్‌ మలింగ 3 వికెట్లతో చెన్నై నడ్డి విరవగా, నితీశ్‌ కుమార్‌ రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు