కందిగంటి రాకెష్ జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోలేనివి..

0
155
The memories of Kandiganti Rakesh will never be erased..
The memories of Kandiganti Rakesh will never be erased..

కీ.శే కందిగంటి రాకెష్ ప్రథమ వర్దంతిలో కుటుంబ సభ్యులు

హైదరాబాద్ (నాగోల్ జైపురి కాలనీ) : “మీ మరణం మా హృదయాల్ని కలచి వేసింది. మీ జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోలేనివి.. భౌతికంగా మీరు లేకపోయినా, అవి ఎప్పుడు మాతో ఉంటాయి” అంటూ కీ.శే కందిగంటి రాకెష్ ని అతడి భార్య శిల్ప , కుటుంబ సభ్యులు.. అన్నదమ్ములు రాజు, రవి, విజయ్ , రాము, మధులు గుర్తు చేసుకున్నారు. ”చెరగని మీ చిరునవ్వు మా మనస్సులో చిరస్థాయిగా నిలిచినా.. మీ మరణం మాకు తీరని లోటు. మీరు మా నుండి దూరమై సంవత్సర కాలం గడిచినా మీ మధుర స్మృతులు .. జ్ఞాపకాలు మా మదిలో పదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాము” అంటూ కీ.శే కందిగంటి రాకెష్ (17/3/1986-18/11/2024) కుటుంబాన్ని వదిలి ఏడాది పూర్తయిన సందర్బంగా అతడి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ప్రథమ వర్ధంతిని జరుపున్నారు. బుధవారం (సెప్టెంబర్ 10, 2025) నాగోల్ జైపురి కాలనీలోని ఎగ్గె మల్లేషం బీరప్పగుడి లో జరిగిన ఈ కార్యానికి బంధు మిత్రులు, హితులు.. సన్నిహితులు , శ్రేయోభిలాషులు హాజరై కీ.శే కందిగంటి రాకెష్ తో తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. రాకెష్ కుటుంబానికి ఆ దేవుడు బాధను భరించే శక్తిని ఇవ్వాలని మిత్రులు ప్రార్ధించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. రాకేష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని వేడుకున్నారు. ఈ సందర్బంగా రాకేష్ బ్రదర్ విజయ్ అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ .. ”రాకేష్ లేరన్న చేదు నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకు పోతున్నాను.. ఇప్పుడు కూడా అతడు మా పక్కనే ఉన్నట్లు ఉన్నారు. జీవితంలో కొన్ని చేదు నిజాలని అంగీకరించలేము. రాకేష్ జ్ఞాపకాలు ఎప్పుడూ మా తోనే ఉంటాయి. మా జీవితాన్ని ప్రభావితం చేసిన అతడికి కన్నీటితో నివాళి అర్పిస్తున్నాను. రాకేష్ జ్ఞాపకాలు ఎప్పటికీ నా మదిలో పదిలం. మరణం ఒక మహోన్నతమైన విశ్రాంతి. జీవం నడవడానికి ఒకింత బిగుతు అవసరం. సకాల మరణమేమీ విపత్తు కాదు. ఎన్నో సార్లు జన్మించడం అదే నిజమైన విపత్తు. జీవం ఎంతో, మరణమూ అంతే. ఈ విషయం స్పృహలో ఉంటేనే మనం జీవితాన్ని పూర్తిగా శక్తివంతంగా జీవించగలం. మన జీవితంలో ఒకరిని కోల్పోయినప్పుడు, మనం ఎవరిని అంతగా ప్రేమిస్తున్నామో, సమయం నిలకడగా అనిపిస్తుంది. రాకేష్ మరణ వార్త విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అతడు ఎంత దూరంలో ఉన్నా, ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు. అతడి మరణం నిజంగా మాకు తీరని లోటు” అంటూ తన మనసులోని బాధను ధిగమిగుతూ రాకేష్ తో గల అతడి అనుబంధాన్ని కన్నీటి పర్యంతమవుతూ గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్బంగా జరిగిన కీ.శే కందిగంటి రాకెష్ ప్రథమ వర్దంతిలో కుటుంబ సభ్యులైన కొడుకులు బంటి, చింటూ, క్రాంతి, బాలు, సురేష్, సాయి, ప్రణీత్, చందు, వదినలు ప్రసన్న, సుజాత, కవిత, సంధ్య, రమణి, కూతుర్లు సోనీ, దివ్య, సింధు, దత్తు, లక్కీ , శశిరేఖ , అక్క శ్రీలత బావ మెన్ దాస్ , అల్లుడు పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొని రాకేష్ తో గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాకెష్ ప్రథమ వర్దంతిలో రాకెష్ ను గుర్తు చేస్తూ జరిగిన గీతాలాపన అందరి మనసులను కదిలిందించింది.