పాత పెద్దమ్మ తల్లి గుడి విషయమై భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే న్యాయాస్థానాన్ని ఆశ్రయిస్తాం : నిర్మాణ కమిటీ హెచ్చరిక

0
138
We will approach the court if the sentiments of devotees are hurt regarding the old Peddamma Tallu temple: Construction committee warns
We will approach the court if the sentiments of devotees are hurt regarding the old Peddamma Tallu temple: Construction committee warns

పాత పెద్దమ్మ తల్లి గుడి విషయమై సోమవారం రోజున పెద్దమ్మ తల్లి గుడి బాలాలయ నిర్మాణము మరియు అమ్మవారి పూజలు జరుపుకోవడానికి గుడి నిర్మాణం జరిగే వరకు బాలాయలంలో పూజారి కార్యక్రమాలు జరిపించుటకు మంచిదని పీఠాధిపతులు పండితుల సూచన మేరకు ప్రజా దర్బారులో హైదరాబాద్ కలెక్టర్ కు ఆలయ నిర్మాణ కమిటీ మరియు హిందూ సంస్థలు భక్తులు అందరూ కలిసి అనుమతి కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆలయ కమిటీ, ధార్మిక సంస్థలు అందరూ కలిసి పాత్రికేయులనుద్దేశించి మాట్లాడుతూ.. తదుపరి కార్యాచరణ ఏ విధంగా చేయబోతున్నారో ప్రకటించడం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను వినతి పత్రాలు అందజేయడం వారి మద్దతు కోరడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మా అమ్మవారు అక్కడే వెలసింది. మా అమ్మ వారి గుడి అక్కడే నిర్మాణం కావాలని.. అంతవరకు ప్రాణాలు పోయినా సరే పోరాడుతామని తెలియజేశారు అడ్వకేట్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. హైకోర్టు ఆర్డర్ డబ్ల్యూపి నెంబర్ 24287 ఆఫ్ 25 ప్రకారంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ని అమ్మవారి విగ్రహాన్ని భద్రపరచాలని ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. ధార్మిక సెల్ స్టేట్ బిజెపి తెలంగాణ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ గా ఉన్న కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ఆలయం గురించి అసెంబ్లీలో త్వరలో నిర్ణయం తీసుకోపోతే భక్తులు మనోభావాలు దెబ్బతీస్తున్న ప్రభుత్వం పైన అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి న్యాయస్థానానికి వెళ్తాము. అలాగే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు. ధార్మిక సెల్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు బోడి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. హిందూ మనోభావాలు గౌరవిస్తూ పౌర్ణమి లోపల అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని.. అక్కడ అమ్మవారిని ప్రతిష్టించి పూజలు జరిపేటట్టుగా చేయాలని, దేవి నవరాత్రి అమ్మవారికి ఇష్టం కావున అక్కడ అర్చన జరగాలని ఆయన అభ్యర్థించారు ఈ సమావేశంలో మహేష్ వీహెచ్ పీ, అమర్నాథ్ అడ్వకేట్, శివశంకర్ నాథ్ అడ్వకేట్.. అవదేశ్ బజరంగ్ దళ్, మహేష్ బజరంగ్ దళ్ తదితరులు పాల్గొన్నారు.