వృత్తి కమిటీలను పునరుద్దరించాలని టియుడబ్ల్యూజె మహాసభ తీర్మానం ఆమోదం

0
99

తీర్మానం ప్రవేశ పెట్టిన మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు

ఖమ్మం లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టియుడబ్ల్యూజె-ఐ జె యు ) మూడవ మహాసభ లలో వృత్తి కమిటీలను పునరుద్దరించాలని కోరుతూ సంఘం మేడ్చల్ అధ్యక్షులు గడ్డమీది బాలరాజు తీర్మానం ప్రవేశపెట్టారు. విధి నిర్వహణ లో జర్నలిస్తులు ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారానికి, సంక్షేమ పథకాలు అమలు, వెజ్ బోర్డు సిఫార్సుల అమలుకు కమిటీలను వేయాల్సి ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయా కమిటీ లను వేశారని గుర్తు చేశారు. పదేళ్ల కాలంలో బిఆర్ ఎస్ ప్రభుత్వం వీటిని విస్మరించిందని తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆయా కమిటీలను ఏర్పాటు చేయాలనీ మహాసభ ల వేదికపై డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడుల నిరోదానికి హోమ్ మంత్రి చైర్మన్ గా రాష్ట్ర స్థాయి కమిటీ, జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా కమిటీ ని ఏర్పాటు చేయాలన్నారు. వెజ్ బోర్డు సిఫార్సుల అమలుకోసం కార్మిక శాఖ కమిషనర్ చైర్మన్ గా ట్రైపాక్షిక కమిటీ ని పునరుద్దరణ చేయాలన్నారు. ఆపదలో ఉన్న జర్నలిస్టులను ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన వెల్ఫేర్ ఫండ్ కమిటీ లో జర్నలిస్టుల యూనియన్ ల ప్రతినిధులకు స్థానం కలిపించాలని బాలరాజు తీర్మానం లో ప్రవేశపెట్టారు. జర్నలిస్టుల వృత్తి కమిటీ లపై ప్రవేశ పెట్టిన తీర్మానం ను మహాసభ ఆమోదం తెలిపింది.