ప్రస్తుతం మల్టీ జోన్ -1 ఐ జి గా విధులు నిర్వహిస్తున్న ఏ వి రంగనాథ్ ips కు తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక భాద్యత అప్పగించింది
ఇప్పటి వరకు హైదరాబాద్ GHMC పరిధికి మాత్రమే పరిమితమైన విజిలెన్స్,ఎన్ ఫోర్స్ మెంట్,డిజాస్టర్ మేనేజ్మెంట్ పోస్ట్ ను అప్గ్రేడ్ చేసి.. HMDA పరిధికి విస్తరిస్తూ సాయంత్రం ప్రభుత్వం GO విడుదల చేయబోతుంది..!
ఇప్పటివరకు HMDA పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు -నాళాల ఆక్రమణలు -చెరువుల ఆక్రమణలు అన్నీ సమూలంగా నిర్మూలించే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇంచార్జి గా ఏ వి రంగనాథ్ కి భాద్యత అప్పగించనున్నారు..!
స్పెషల్ టాస్క్ ఫోర్స్ విభాగం …నేరుగా ముఖ్యమంత్రి ఆధీనంలో వర్క్ చేయనుంది..
కమాండ్ కంట్రోల్ రూం (బంజారా హిల్స్ ) కేంద్రంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఏర్పాటు కాబోతుంది..
HMDA పరిధిలో కబ్జాల మీద ఉక్కుపాదం మోపే భాద్యత నేరుగా సీఎం పర్యవేక్షణలో రంగనాథ్ చూసుకునే విధంగా ప్రభుత్వం సాయంత్రం లోపు GO జారీ చేయబోతున్నట్లు సమాచారం …❗