మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్: మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికి ఎల్లప్పుడు ముందుంటానని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు నూతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్‌కు అభినందన కార్యక్రమాన్ని ఎఫ్‌సీఐ కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఈటల మాట్లాడుతూ నా విజయాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించవచ్చన్నారు. డబ్బు, మద్యాన్ని నమ్ముకున్న వారికి నా విజయం చెంపపెట్టు అన్నారు. మాట ఇచ్చినవాళ్లే గెలిపించినారని, ఓటర్లే నాకు ఓనర్లు అన్నారు. విశ్వాసం, నమ్మకం నామీద ఏవిధంగా పెట్టి గెలిపించారో అదేవిధంగా మీ కోసం కష్టపడి పనిచేస్తానన్నారు. ఎక్కడ సమస్యలున్నా పరిష్కరించడమే నా కర్తవ్యం అన్నారు. పిలుస్తే పలికే నాయకుడినని, మీ కాలుకు ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానని పేర్కొన్నారు….