మానవ రక్త సమూహాలను కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్‌స్టైనర్ సేవలు చిరస్మరణీయం: సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి

0
104

మానవ రక్త సమూహాలను కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్‌స్టైనర్ సేవలు చిరస్మరణీయమని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి అన్నారు. శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్‌స్టైనర్ వర్థంతి సందర్బంగా డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యం లో మానవ రక్త సమూహాలను కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్‌స్టైనర్ వర్థంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు.
ఈ సందర్బంగా , సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.
కార్ల్ లాండ్ స్టీనర్ 14 జూన్ 1868 జన్మించారు. ఈయన జీవశాస్త్రవేత్త, వైద్యుడు, పేథాలజిస్టు, రోగనిరోధక శాస్త్రవేత్త. తొలుత రక్తం యొక్క గ్రూపులను గుర్తించిన శాస్త్రవేత్త. ల్యాండ్ స్టీనర్ ను “ఫాదర్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్” (Father of Transfusion Medicine) అని పిలుస్తారు. ల్యాండ్ స్టీనర్ కు 1930లో వైద్య విభాగంలో నోబెల్ బహుమతి లభించింది. ఈయన 26 జూన్ 1943 న స్వర్గస్తులైనారు. ఇలాంటి మహానుభావులను ఎల్లవేళల స్మరించుకుంటు వారి అడుగుజాడలలో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు.