రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరం

మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలాశాసనం

వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానం

రైతు భరోసాకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు ప్రభుత్వ నిర్ణయాల ప్రకటనకు ఇద్దరు మంత్రుల నియామకం కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వరంగల్ రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రైతుల రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని మంత్రివ ర్గం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న రుణాల వివరాలు తెప్పిం చుకొని, వాటిని క్రోడీకరించిన తర్వాతే ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ మేరకు శుక్ర వారం కేబినెట్ భేటీ అనంతరం మంత్రివర్గం తీసు కున్న నిర్ణయాలను సీఎం స్వయంగా మీడియాకు వెల్లడించారు. “గత బీఆర్ఎస్ సర్కారు పదేండ్ల పాలనలో మొదటి విడత రూ.16 వేల కోట్లను, రెండో విడత రూ.12 వేల కోట్లను మాత్రమే రైతుల ఖాతాల్లో వేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఎందరో రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. కానీ మేము ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ కట్ ఆఫ్ తేదీ నుండి 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 మధ్యలో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తాం. ఈ రుణాల మాఫీ చేయడానికి రూ.31 వేల కోట్ల రూపాయలు అవసరం” అని తెలిపారు.రైతు సంక్షేమం కోసం మా ప్రభుత్వం రుణమాఫీ చేయాలని నిర్ణయించిందన్నారు. గత ప్రభుత్వం పదెండ్లలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు మా ప్రభుత్వం ఎనిమిది నెలలు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని సీఎం తెలిపారు.

జులై10లోపు నివేదిక:

రైతు భరోసాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి..రోడ్లు, కొండలు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, ధనికులకు రైతు భరోసా ఇస్తున్నారని చర్చ జరుగుతోందని,
అందుకే రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం నియమించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రంలో అనేక రకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అందరి సూచనలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
జులై 10లో పు ప్రభుత్వానికి ఉప సంఘం నివేదిక ఇస్తుందని, ఆ నివేదికను బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవే శపెడ్తామని తెలిపారు. ఇక నుంచి ప్రభుత్వ నిర్ణయాలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి మాత్రమే మీడియాకు చెప్తారని సీఎం ప్రకటించారు.

రైతు భరోసామంత్రివర్గ ఉపసంఘం:

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని నియమించామని చెప్పారు.

జూలై 15లోగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందన్నారు.

ఈ నివేదికను శాసనసభలో పవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తామన్నారు.
మంత్రివర్గ నిర్ణయాలు, ప్రభుత్వ పరిపాలనపరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యత శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటారని , వారిద్దరు ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారమన్నారు.రుణమాఫీపై తినబోతూ రుచులెందుకు.
రైతు రుణమాఫీ చేసి తీరుతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.