బక్రీదు గోవధ జరగకుండా చూడండి: హైకోర్టు

0
131

బక్రీద్ వేళ గోవధ జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గోవుల తరలింపును అడ్డుకోవాలని పోలీసులను ఆదేశించింది. అక్రమంగా గోవులను చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. జంతువధ చట్టం అమలులో ఉన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. బక్రీద్ వేళ గోవధను అడ్డుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఇలా స్పందించింది.