ఫీజు చెల్లించ లేదని విద్యార్థులకు బదిలీ ధృవీకరణ పత్రాన్ని (టిసి)తోపాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వని విద్యా సంస్థల యాజమాన్యల బాధితులకు అండగా నిలుస్తా :

0
109

హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే మంచి విద్యను అభ్యసించడానికి .. ప్రైవేట్ స్కూల్లలో చేర్పించాలని అనుకుంటారు.. ఇక ప్రైవేట్ సంస్థలు కూడా ఇదే అదనుగా తీసుకొని ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ భారీ మొత్తంలో ఫీజులను వసూళ్లు చేస్తున్నాయి. ఈ పీజుల దోపిడీ బరాయించలేని తల్లితండ్రులు తమ పిల్లలను ఇతర పాఠశాలల్లో చేర్పించడానికి ప్రయత్నించినపుడు విద్యార్థులకు బదిలీ ధృవీకరణ పత్రాన్ని(టిసి) ఇవ్వకుండా పసలేని కారణాలతో విద్యార్థుల తల్లితండ్రులను ఇబ్బంది పెడుతున్నారు. ఫిర్యాదుపై స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇది ముమ్మాటికీ హైకోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కడమే అవుతుందని హై కోర్టు న్యాయవాది సుంకర నరేష్ తెలిపారు. కాబట్టి ఈ విధంగా బదిలీ ధృవీకరణ పత్రాన్ని (టిసి), ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్న విద్యాసంస్థలపై న్యాయపోరాటం చేయడానికి బాధిత విద్యార్థుల తరుపున వారి సమస్యకు పరిష్కారం చూపే వరకు ఉచితంగా న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. బాధితులు 7710678678 నెంబర్ కు ఫోన్ చేసి తనను సంప్రదించాల్సిందిగా కోరారు. గతంలో కూడా ఉప్పల్ నియోజవర్గ ప్రజలకు ఉచిత న్యాయ సహాయ కేంద్రం అందుబాటలోకి తీసుకువచ్చి ఏంతో మందికి సహాయం చేస్తున్న సంగతి విధితమే.