ప్రభుత్వ సేకరించిన భూములను ఇండ్ల స్థలాలకు కేటాయించాలి

0
85

పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి
వర్గ సభ్యులు డిమాండ్.

నల్లగొండ మండలం లో ప్రభుత్వం ఇళ్ల స్థలాల కొరకు భూములు కొనుగోలు చేసిందని నేటికి పంపిణీకి నోచుకోలేదని వెంటనే అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించి ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు ఈరోజు సోమవారము నాడు మండల గ్రీవెన్స్ డే లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్లను కేటాయించి మండల స్థాయిలో గ్రీవెన్స్ డే లు నిర్వహించడం మంచి పరిణామం అన్నారు పేదల నుండి వచ్చిన దరఖాస్తులను పరిష్కారానికి నోచుకునే విధంగా ప్రయత్నం చేయాలని గతం లాగా బుట్ట దాఖలు చేయకూడదని అన్నారు. నల్లగొండ మండలంలో అప్పాజీపేట దోమలపల్లి అన్నారెడ్డి గూడెం రసూల్ పురం అన్యపర్తి జీకే అన్నారం ముశంపల్లి గ్రామాలతోపాటు ప్రభుత్వ భూములు ఉన్న అన్ని గ్రామాలలో పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరారు. నల్లగొండ మండలం పెద్ద సూరారం పరిధిలో 540 సర్వే నెంబర్లు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అన్యాక్రాంతం కాకముందే పెద్ద సూరారం రామారం చందనపల్లి గ్రామాల ఇండ్లు లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ దొండ కృష్ణారెడ్డి కొండ వెంకన్న బోల్లు రవీందర్ మల్లె బోయిన రామలింగయ్య కట్ట అంజయ్య తదితరులు పాల్గొన్నారు.