తొలి పార్లమెంట్‌ సమావేశానికి ట్రాక్టర్‌పై వచ్చిన సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్‌

0
121

రైతు నేత, సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్‌ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వెళ్లారు. సోమవారం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. అయితే రాజస్థాన్‌లోని సికార్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) తరపున గెలిచిన అమ్రారామ్‌ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వెళ్లారు. రైతులు తమ వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్‌ను వాడుతారు. ఇప్పుడు ట్రాక్టర్‌ రైతు పని ముట్టుగా తయారు అయింది. ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన చారిత్రాత్మక రైతు పోరాటంలో రైతులతో పాటు ట్రాక్టర్లు కూడా వేలాదిగా పాల్గొన్నాయి. రైతులు తమతో పాటు ట్రాక్టర్లు తీసుకొచ్చి ఆందోళనలు చేపట్టారు. రైతు ఉద్యమానికి ట్రాక్టర్లు కొండంత అండగా నిలిచాయి. అప్పుడు కొన్నాళ్లు ఢిల్లీలోని పార్లమెంట్‌, ఇండియా గేట్‌, కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యాలయాలున్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు నిషేధించారు. అప్పటి నుంచి మోడీ సర్కార్‌లో ట్రాక్టర్‌ అంటే భయం పట్టుకుంది. అలాంటి ట్రాక్టర్‌పై సీపీఐ(ఎం) లోక్‌సభ ఎంపీ అమ్రారామ్‌ పార్లమెంట్‌కు రావడం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది.