దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల గవర్నర్లు మార్పుకు రంగం సిద్ధం….❓
తెలంగాణతో పాటు జాతీయ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలు ముగిసిపోవడం, కేంద్రంలో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రాల గవర్నర్ల మార్పులు చేర్పులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ ను నిమమించనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఇన్ చార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. పుదుచ్చేరి, జార్ఖండ్ గవర్నర్గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే తెలంగాణకు కొత్త గవర్నర్ ను నియమించాలని
కేంద్రం భావిస్తోంది. అయితే తెలంగాణ గవర్నర్ గా కేంద్ర మాజీ సివిల్ సప్లమ్ ఎన్విరాన్ మెంట్, ఫుడ్ కార్పొరేషన్ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త గవర్నర్ అంశం హాట్ టాపిక్ గా మారింది.
మోడీకి అత్యంత సన్నిహితుడు:
1953 జనవరిలో బిహార్ లో జన్మించిన అశ్విని
కుమార్ చౌబే రాష్ట్ర రాజకీయాల్లో
నుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా
కొనసాగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి
అత్యంత సన్నిహితుడు, నమ్మదగిన వ్యక్తి అనే
పేరున్న అశ్విని కుమార్ గత ప్రభుత్వంలో మోడీ
కేబినెట్ లో పని చేశారు. అయోధ్య రామ
మందిరం నిర్మాణ ప్రక్రియలో కీలక అశ్విని
కుమార్ కీల పాత్ర పోషించారు. అయితే
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా
వ్యూహారచన చేస్తున్న బీజేపీ అందుకు
అనుగుణంగా పావులు కదుపుతోంది. ఈ
మేరకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని
బలోపేతంపై దృష్టి సారించి కాశాయపార్టీ
ప్రభుత్వం
రాజ్యంగబద్ధమైన
పదవుల
విషయంలోనూ జోరుపెంచినట్లు కనిపిస్తోంది.
ఈ మేరకు ప్రస్తుతం ఇన్ చార్జి గవర్నర్ స్థానంలో
మోడీకి అత్యంత నమ్మకస్తుడైన అశ్విని కుమార్ చౌబే పేరును గవర్నర్ గా పంపించాలని భావిస్తున్నారనే టాక్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
*కర్నాటకకు కిరణ్ కుమార్ రెడ్డి*
ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కిరణ్ కుమార్ రెడ్డికి సైతం గవర్నర్ పోస్ట్ వరించబోతున్నదని అయితే అతన్ని కర్ణాటకకు నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాది క్రితం బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా అధిష్టానం నియమించింది. ఈ క్రమంలో ఆయన్ను గవర్నర్ గా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణకే గవర్నర్ గా పంపించబోతున్నారనే ప్రచారం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సమైక్యవాదిగా ముద్రపడిన కిరణ్ కుమార్ రెడ్డిని ఎలా గవర్నర్ గా నియమించబోతున్నారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వ్యక్తం అయ్యాయి. దీంతో ఆయన్ను కర్ణాటక గవర్నర్ నియమించబోతున్నట్లు తెలుస్తోంది…