టారిఫ్ పెంచినా టార్గెట్ మారలేదు!
ఓవైపు రీఛార్జ్ ధరలు పెంచినా Vi యూజర్లను తమవైపు తిప్పుకోవాలనే లక్ష్యాన్ని జియో, ఎయిర్టెల్ సంస్థలు మార్చుకోలేదంటున్నారు విశ్లేషకులు. ‘టారిఫ్ పెంచిన తీరే ఇందుకు నిదర్శనం. 2జీ యూజర్లను ఆకర్షించేందుకు జియో 4జీ ఫీచర్ ఫోన్ టారిఫ్ (₹91/28 రోజులు) మార్చలేదు. ఎయిర్టెల్ 2జీ ప్లాన్స్‌లో పెంపును 11%కు (₹199/28 రోజులు) పరిమితం చేసింది. ఈ నిర్ణయంతో సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయని ఇరు సంస్థలు ఆశిస్తున్నాయి.