జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం: DGP హరీశ్ గుప్తా

0
115

ఎ పి: కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీశ్ గుప్తా వెల్లడించారు.

జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు.

అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు.

సోషల్ మీడియాలో వచ్చే వార్తలనూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.