కడప జిల్లా కాశినాయన మండలం ఉప్పులూరు గ్రామంలో జూన్ 1 శనివారం శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి తిరుణాల మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ముత్తుముల రాజనారాయణరెడ్డి ఉప్పలూరు సర్పంచ్, ప్రచారకర్త బి యస్ నారాయణరెడ్డి సంఘసేవకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుండి అభయాంజనేయ స్వామి గుడి ఆవరణము నందు పురోహితులు వారణాశి రమణయ్య ఆధ్వర్యంలో వేదపండితులచే ప్రత్యేకంగా యజ్ఞం పూజా కార్యక్రమాలు జరుగును. రాష్ట్రస్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలు కలవు పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి ఒక లక్ష రూపాయలు రెండవ బహుమతి 70 వేల రూపాయలు మూడో బహుమతి 40 వేల రూపాయలు నాలుగవ బహుమతి 20వేల రూపాయల బహుమతులు ప్రకటించినట్లు నిర్వహవులు తెలిపారు. బండలాగుడు పోటీలలో పాల్గొనే వారు ఉప్పలూరు సర్పంచ్ ఎం రాజా నారాయణరెడ్డి
ఉప్పలూరు వారి సెల్ 9490 79 2999,9441932390 ను సంప్రదించవలసిందిగా తెలిపారు ఎడ్ల బండ లాగు పోటీలలో పాల్గొనే వారు జూన్ 1న 2024 శనివారం మధ్యాహ్నం రెండు గంటల లోపు 800 రూపాయలు ఎంట్రీ ఫీజు చెల్లించి దేవస్థానం వద్ద రసీదు పొందాలన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులచే కోలాటములు కులుకు భజన చెక్కభజన జరుగును ఉదయం 8 గంటలకు గణపతి పూజ శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారికి మన్య సూక్త పురుష సూక్తములతో అభిషేకములు పంచామృత అభిషేకములు నూతన వస్త్ర అలంకరణలతో అష్టోత్తర శతనామ కార్యక్రమములుకలవు అనంతరం తీర్థ ప్రసాదములు ఈ తిరుణాల మహోత్సవంలో వేల వేల మంది పైగా భక్తులు పాల్గొని అభయాంజనేయ స్వామిని దర్శించుకుని సకల సౌభాగ్యములు పొందగలరని నిర్వాహకులు ఆశిస్తున్నారు ఈ తిరుణాలలో పాల్గొనే భక్తులకు రుచికరమైన భోజనముతో పాటు ట్యాంకర్ ద్వారా మజ్జిగ ఏర్పాటు చేస్తున్నారు.