జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీటీవో కి వినతి

0
122

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో బూర్గంపాడు మండల
ఎంపీటీవో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ రఘుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ అసిస్టెంట్ రఘు సానుకూలంగా స్పందించారు.

వినతి పత్రం ఎంపీడీవో కి అందిస్తానని ,
మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు .
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నెల రోజులు బూర్గంపాడు మండలంలో ఉపాధి పని ప్రాంతాన్ని సందర్శిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నామని,
సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందని
అన్నారు. ఉపాధి హామీ పని
సంవత్సరంలో వంద రోజులు పూర్తి కావట్లేదని
కొలతల పేరుతో వేతనాలు సరిగా ఇవ్వట్లేదని ప్రతి ఒక్క ఉపాధి కార్మికుడికి రోజుకు రూ.150 నుండి 100 లోపే పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం
300 రూపాయలు వేతనం నిర్ణయించినా అది ఉపాధి కార్మికులకు అందని ద్రాక్షగా మారిందని వారు తెలిపారు.
అదే విధంగా పని ప్రాంతంలో దెబ్బలు తగిలి గాయాలు అయిన వారికి మెడికల్ బిల్లు ఇవ్వట్లేదని పేర్కొన్నారు. రెండు ఫోటోలు పేరుతో కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని
ఈ సమస్యల్ని వెంటనే అధికారులు ప్రభుత్వం పరిష్కారానికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వ్య.క.స మండల కార్యదర్శి భయ్యా రాము సిఐటియు మండల కన్వీనర్
బర్ల తిరపతయ్య మడకం సోమయ్య సూర్య తదితరులు పాల్గొన్నారు.