కేంద్రంలో మూడవసారి కొలువుదీరిన నరేంద్ర మోడీ మంత్రివర్గంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా గురువారం ఢిల్లీలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన జి కిషన్ రెడ్డిని మాజీ మేయర్ దంపతులు బండ కార్తీక చంద్రారెడ్డి లు లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించి, శ్రీ తిరుమల వెంకటేశ్వర ప్రతిమను బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిధులచే అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా చేసుకునేందుకు అవకాశం లభించడంపై బండ కార్తిక రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కి, మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బండ చంద్రారెడ్డి, సికింద్రాబాద్ నియోజకవర్గ బిజెపి కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి విహెచ్పిఎస్ జాతీయ నాయకులు కొల్లి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.