ఎల్లుండి నుంచి వెబ్ సైట్ లో DSC హాల్‌టికెట్లు

0
99

ఎల్లుండి నుంచి వెబ్ సైట్ లో DSC హాల్‌టికెట్లు
తెలంగాణలో నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షకు హాల్‌టికెట్లు ఈనెల 11వ తేదీ సాయంత్రం నుంచి వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంటాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవల విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటించింది. హాల్‌టికెట్లను www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలకు డీఎస్సీ నిర్వహిస్తున్నారు.