* సమస్యలు పరిష్కరించని హెచ్ఎండిఏ , జిహెచ్ఎంసి ఎవరికి వారు యమునా తీరే
* సతమతమవుతున్న భగయత్ వాసులు
ఉప్పల్ భగాయత్ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ బాగాయత్ లో విస్తృతంగా పర్యటించారు. సందర్భంగా భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలు విన్నవించి వినత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల్ బగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి వారు హెచ్ఎండిఏ లేఔట్ లో ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తూ కనీసం రోడ్లు, పరిసర ప్రాంతాలు శుభ్రపరిచే పరిస్థితి లేదనీ, లేఅవుట్ మొత్తం చెత్తతో నిండిపోయిందనీ,
లేఔట్ లో అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ డ్రైనేజ్ అవుట్ లెట్ కనెక్షన్ లేకపోవడంతో ఎక్కడకక్కడ మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయనీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి విన్నవించారు.
అదేవిధంగా లేఔట్ లో ఏ రోడ్ లో చూసిన స్ట్రీట్ లైట్స్ వెలిగే పరిస్థితి లేదు రాత్రిపూట ఇళ్లల్లో దొంగలు పడటం అదేవిధంగా రోడ్లపై అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న పట్టించుకోని పరిస్థితి ఉందని ఎమ్మెల్యేకు తెలిపారు.
వర్షాలు పడుతున్నప్పుడు స్ట్రామ్ వాటర్ 80 ఫీట్ల రోడ్లపై పొంగి పొర్లుతున్న జిహెచ్ఎంసి వారు కానీ, వాటర్ వర్క్స్ వారు కానీ సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదనీ,
వీటితోపాటు ఇల్లు నిర్మించుకున్న భగాయత్ వాసులు కొత్తగా హౌస్ నెంబర్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి భగాయత్ పేరుతో కాకుండా చుట్టుపక్కల ఉండే కాలనీలా పేర్లతో అడ్రస్ లు ఇవ్వడం జరుగుతుందనీ సమస్యలు ఎమ్మెల్యే ముందు తెలిపారు.
హెచ్ఎండిఏ వారు 433 ఎకరాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లేఅవుట్ కి భగయత్ పేరు కాకుండా చుట్టుపక్కల కాలనీల పేర్లు రావడం ఏంటని ప్రశ్నించారు.
ఈ సమస్యలన్నిటిని హెచ్ఎండిఏ వారి దృష్టికి తీసుకువెళ్తే వారు మా దగ్గర సంబంధిత సిబ్బంది (manpower) లేదు కావున జిహెచ్ఎంసి వారి దగ్గరికి వెళ్ళమనీ చెప్పారు అన్నారు.
జిహెచ్ఎంసి వారి దృష్టికి తీసుకువెళ్తే వారు మాకు సంబంధం లేదు హెచ్ఎండిఏ వారు మాకు ఇంకా ఫైల్ అందజేయలేదని చెప్తు కాలయాపన చేస్తున్నారనీ ,
జిహెచ్ఎంసి వారు టాక్స్ వసూలు చేసే దానిపై పెట్టిన శ్రద్ధ సమస్యలు తీర్చే ప్రయత్నంలో పెట్టడం లేదని భగయత్ వాసులు వాపోతున్నారు.
అటు హెచ్ఎండిఏ వారు ఇటు జిహెచ్ఎంసి వారికి మధ్యలో భగయత్ వాసులు అనేక తీరని సమస్యలతో నలిగిపోతున్నా మని
సమస్యలన్నిటిని ఎమ్మెల్యే కి వివరించారు.
సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరలో సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ఉప్పల్ భగయత్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ మేకల మధుసూదన్ రెడ్డి , కమిటీ సభ్యులు గోనె అర్జున్ రెడ్డి , ఒక్కంటి శ్రీనివాసరావు, బంగ్లా శ్రీనివాస్ రెడ్డి, పిల్లి నాగరాజు, నవీన్, సురేందర్ రెడ్డి, చింతల నరసింహారెడ్డి, శోభ, రవళి, తదితరులు పాల్గొన్నారు.