ఆదివాసి విద్యార్థులకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలి : సాగబోయిన పాపారావు కార్యనిర్వాహక అధ్యక్షులు,ఆదివాసీ విద్యార్థి సంఘం ఏ ఎస్ యు

0
96

అడిక్మెట్ ఆదివాసి బాలికల హాస్టల్లో మౌలిక సదుపాయాలు నూతన భవన నిర్మాణం, హైదరాబాదులో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆదివాసి నిరుద్యోగ యువతకి వసతి, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఆదివాసీ విద్యార్థి సంఘం ఏ ఎస్ యు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సాగబోయిన పాపారావు ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క గారితో చర్చించగా వెంటనే గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ఫోన్ చేసి అడిక్మెట్ ఆదివాసి బాలికల హాస్టల్ లో నిరుపయోగంగా ఉన్న 250 గజాల స్థలంలో నూతన భవనం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీనితోపాటు నగరానికి వచ్చి నివాసముంటున్న ఆదివాసి నిరుద్యోగ యువతకు నివాసగృహము స్టడీ సర్కిల్ ఏర్పాటుకు బంజారాహిల్స్ లోని తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కొమరం భీమ్ భవన్ కేటాయించాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ విషయం పట్ల అధికారం త్వరితగతిన నిర్ణయం తీసుకొని రానున్న విద్యా సంవత్సరంలోపు ఆదివాసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని ఆదివాసీ విద్యార్థి సంఘం ASU రాష్ట్ర నాయకత్వం అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం ASU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరేం అరుణ్ కుమార్, అధికార ప్రతినిధిమల్లెల వెంకట్, సహాయ కార్యదర్శి బొచ్చు నరేష్ తదితరులు పాల్గొన్నారు.