డీప్ ఫేక్ వీడియోని (AI) ఏఐ సాయంతో తయారు చేసిన సైబర్ నేరగాళ్లు
ప్రస్తుతం దేశంలో సోషల్ మీడియాలలో వాట్సాప్, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో ఒక వీడియో చెక్కర్లు కొడుతుంది. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ యొక్క డీప్ ఫేక్ వీడియోని సైబర్ నేరగాళ్లు(AI) ఏఐ సాయంతో తయారు చేశారు. ముకేశ్ అంబానీ తన BCFఅకాడమీ ద్వారా అధికరాబడి వస్తుందని చెప్తూ రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్ ను ఆమోదించినట్లు వీడియోని తయారు చేశారు ఆ వీడియోని చూసి చాలా మంది పెట్టుబడి పెట్టాక లక్షలు లాభం వచ్చినట్టు ఆ యాప్ లో చూపించగా చాలామంది పెట్టుబడి పెట్టి మోసపోయారు మీరు కూడా ఇలాంటి వీడియోలు నమ్మి పెట్టుబడి పెట్టారో గోవిందా గోవిందా ఇప్పటికైనా అప్రమత్తంగా మీ బంధువులకు స్నేహితులకు దీని గురించి తెలియజేసి మీ డబ్బులను జాగ్రత్తగా కాపాడుకోండి.
ముంబైలోని అందేరికి చెందిన 54 ఏళ్ల డాక్టర్ పాటిల్ సైబర్ స్కాంకు గురైంది డాక్టర్ పాటిల్ తన ఇంస్టాగ్రామ్ ఫీడ్ లో డీప్ ఫేక్ వీడియోను చూసింది. ముకేశ్ అంబానీ తన బి సి ఎఫ్ అకాడమీ ద్వారా అధిక రాబడి వస్తుందని చెప్తూ ఒక వీడియోను చూసి నమ్మి దాంట్లో 7.1 పెట్టుబడి పెట్టింది దానితో యాప్ లో 30 లక్షలు లాభం వచ్చినట్టు చూపించగా సంతోష పడింది ఇంకేముంది నగదు విత్ డ్రా చేద్దామని అనుకుంది ఈ క్రమంలో పెద్ద షాక్ తగిలింది ఎన్నిసార్లు నొక్కిన డబ్బు మాత్రం విడ్రా కావడం లేదు తాను మోసపోయానని తెలుసుకుంది. ఈ విషయం ట్విటర్లో చెక్కర్లు కొడుతుంది.