పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన “వశిష్ఠ” మూవీ

0
22
"Vashishta" Movie Grand Launch with Pooja Ceremony.

సుమన్ తేజ్, అను శ్రీ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా “వశిష్ఠ”. ఈ చిత్రాన్ని బేబి నేహా సమర్పణలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్ పై నోరి నాగప్రసాద్ నిర్మిస్తున్నారు. మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో దర్శకుడు హరీశ్ చావా రూపొందిస్తున్నారు. “వశిష్ఠ” మూవీ ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు టెలివిజన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, నిర్మాత లయన్ సాయివెంకట్ స్క్రిప్ట్ అందజేశారు. నటుడు గగన్ విహారి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. యాడ్ ఫిలింమేకర్ యమున కిషోర్ ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ చేశారు. ఈ సందర్భంగా….

డీవోపీ కార్తీక్ గరిమెల్ల మాట్లాడుతూ – వశిష్ఠ సినిమాకు వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈ అవకాశం కల్పించిన దర్శకుడు హరీశ్ , ప్రొడ్యూసర్ నాగప్రసాద్ గారికి థ్యాంక్స్. ఈ చిత్రంలో విజువల్స్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. వశిష్ఠ సినిమా సినిమాటోగ్రాఫర్ గా నాకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

సంగీత దర్శకుడు షేక్ మీర్ వలీ మాట్లాడుతూ – ఈరోజు ఈ వేదిక మీద నిలబడి మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉంది. కథలోని ఎమోషన్ ను దర్శకుడు, ప్రొడ్యూసర్ తర్వాత అంతగా ఆస్వాదించేది సంగీత దర్శకుడే. వశిష్ఠ కథ విన్నప్పుడు మంచి ఫీల్ కలిగింది. సక్సెస్ ఫుల్ మ్యూజిక్ ఈ సినిమాకు అందించే ప్రయత్నం చేస్తానని ఆశిస్తున్నాను అన్నారు.

నటి అనిత మాట్లాడుతూ – వశిష్ఠ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాను. ఈ క్యారెక్టర్ లో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు హరీశ్ గారికి, ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా అన్నారు.

నిర్మాత లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ – వశిష్ఠ పోస్టర్ చూస్తుంటే హనుమాన్ సినిమా గుర్తుకు వస్తోంది. హనుమాన్ మూవీలాగే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. టాలెంటెడ్ టీమ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. వారందరిలో కాన్ఫిడెన్స్, సంతోషం కనిపిస్తోంది. వశిష్ఠ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.

నిర్మాత నోరి నాగప్రసాద్ మాట్లాడుతూ – మా వశిష్ఠ చిత్రం ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. సాయివెంకట్ గారు, నాగబాల సురేష్ గారు అతిథులుగా వచ్చి బ్లెస్ చేశారు. పక్కా స్క్రిప్ట్ వర్క్ తో వశిష్ఠ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని అందించే సినిమా అవుతుంది. స్క్రిప్ట్ వినగానే మా హీరో సుమన్ తేజ్ గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. టీమ్ అంతా ఉత్సాహంగా వర్క్ చేస్తున్నాం. ఒక సక్సెస్ ఫుల్ మూవీతో మీ ముందుకు వస్తాం. మీడియా మిత్రుల సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.

నాగబాల సురేష్ కుమార్ మాట్లాడుతూ – వశిష్ఠ సినిమా టీమ్ ఐకమత్యంగా పనిచేస్తున్నారు. సినిమా కంప్లీట్ అయి ప్రేక్షకుల ఆదరణ పొందేవరకు మీరంతా ఇలాగే టీమ్ వర్క్ చేయాలని కోరుకుంటున్నా. ఈరోజు థియేటర్స్, ఓటీటీ, యూట్యూబ్ లో కాంపిటేషన్ బాగా పెరిగిపోయింది. మంచి మార్కెటింగ్ స్ట్రాటజీతో మీ సినిమాను ప్రేక్షకులకు రీచ్ చేయండి. తప్పకుండా సక్సెస్ అందుకుంటారు అన్నారు.

డైరెక్టర్ హరీశ్ చావా మాట్లాడుతూ – మా వశిష్ఠ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే సోషల్ డ్రామా ఇది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. కథ వినగానే సింగిల్ సిట్టింగ్ లో మా హీరో సుమన్ తేజ్ గారు ఓకే చేశారు. మంచి టీమ్ నాకు సపోర్ట్ గా దొరికింది. మ్యూజిక్ మీర్ వలీ, డీవోపీ కార్తీక్ ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు. టీమ్ లో ఏ టెక్నీషియన్ కూడా ఇబ్బంది పెట్టకుండా కోపరేట్ చేస్తున్నారు. అలాగే మా ప్రొడ్యూసర్ నాగ ప్రసాద్ నాకు వెన్నంటే ఉన్నారు. ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తాం. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.

హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ – నేను ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించాను. రంగస్థలం లాంటి బ్యాక్ డ్రాప్ మూవీలో నటించాలనే కోరిక ఉండేది. వశిష్ఠ మూవీ కథ విన్నప్పుడు నేను కోరుకున్న స్క్రిప్ట్ అనే ఫీల్ కలిగింది. వశిష్ఠ టైటిల్ లోనే ఒక పాజిటివ్ నెస్ ఉందనిపించింది. మా ప్రొడ్యూసర్ గారు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. డైరెక్టర్ హరీశ్ ప్రతిభ ఈ సినిమాతో అందరికీ తెలుస్తుంది. టైమ్ తీసుకోకుండా వెంటనే ఓకే చెప్పాను. అలాగే ఫ్రెండ్లీ అండ్ టాలెంటెడ్ టీమ్ దొరికారు. మేమంతా ఒక మంచి మూవీతో మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. తప్పకుండా వశిష్ఠ మూవీ సక్సెస్ మీట్ లో కలుద్దాం అన్నారు.

నటీనటులు – సుమన్ తేజ్, అను శ్రీ, అనిత, తదితరులు

టెక్నికల్ టీమ్
పబ్లిసిటీ డిజైనర్ – వివా రెడ్డి
డీవోపీ – కార్తీక్ గరిమెల్ల
మ్యూజిక్ – షేక్ మీర్ వలీ
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – బుస్సా బాలరాజు
పీఆర్ఓ – చందు రమేష్
నిర్మాత – నోరి నాగప్రసాద్
రచన, దర్శకత్వం – హరీశ్ చావా