ఈ నటి జీ థియేటర్ యొక్క ‘సూర్య కి అంతిమ్ కిరణ్ సే సూర్య కి పెహలీ కిరణ్ తక్’ టెలీప్లేలో నటించారు, ఇది ఇప్పుడు కన్నడ మరియు తెలుగు భాషలలోకి అనువదించబడింది
ముధురిమ తులి రోజువారి సబ్బుల ఫ్యాన్స్ కు సుపరిచితురాలే మరియు ఈమె రియాలిటి షోలలో పనిచేశారు మరియు ‘బేబి’, ‘నామ్ షబానా’, ‘సత్తా’ (తెలుగు), ‘మారీచ’ (కన్నడ మరియు తమిళము) మరియు ‘నింబెహుళి’ (కన్నడ) వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలలో కూడా నటించారు. హాలీవుడ్ చిత్రము ‘ది బ్లాక్ ప్రిన్స్’ లో కూడా నటించిన ఈ నటి, తాను నటించిన హింది టెలీప్లే ‘సూర్య కి అంతిమ్ కిరణ్ సే సూర్య కి పెహలీ కిరణ్ తక్’ కన్నడ మరియు తెలుగు భాషలలోకి అనువదించబడినప్పుడు చాలా ఆనందించారు. ఆమె మాట్లాడుతూ, “ఈ క్లాసిక్ దశాబ్దాలుగా అభినందించబడుతోంది. అనువదించబడిన టెలీప్లే కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిద్దాము. నిజానికి, ఈ టెలీప్లేలోని అంశము భిన్నమైనది కాబట్టి, ఇది తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నేను అనుకుంటున్నాను.”
ప్రముఖ సాహిత్యవేత్త మరియు నాటకరచయిత సురేంద్ర వర్మ యొక్క పీరియడ్ డ్రామా ‘సూర్య కి అంతిమ్ కిరణ్ సే సూర్య కి పెహలీ కిరణ్ తక్’ తరతరాల ప్రేక్షకులలో భావోద్వేగ స్పందనను అందుకుంది. ‘నియోగ్’ అనే ప్రాచీన ఆచారము చుట్టూ తిరిగే ఈ కథనము రాణి షీలావతి గర్భం ధరించుటకు తన భర్త కాకుండా వేరొక వ్యక్తిని ఎంచుకోవాలనే బలవంతానికి గురి అయినప్పుడు ఆమె సందిగ్ధతను చూపుతుంది. వివాదాస్పద రాణి పాత్రలో తన సొంత ప్రయాణాన్ని వివరిస్తూ, మధురిమ ఇలా అన్నారు, “ఈ పాత్ర నమ్మదగినదిగా చేయుట చాలా ముఖ్యమైనది. ఇలాంటి పరిస్థితి నాకు వస్తే, నేను ఎలా స్పందిస్తాను అని నేను ఆలోచించే ప్రయత్నం చేశాను.’
ఈనాటి ప్రేక్షకులలో ఈ ప్లే ప్రతిధ్వనిస్తుందా అని చర్చిస్తూ, ఆమె ఇలా అన్నారు, “ఈ నేపథ్యం చరిత్ర నుండి తీసుకోబడింది మరియు ఈరోజు ‘నియోగ్’ జరగకపోయినప్పటికీ మరియు దత్తత అనే ఎంపికలు ఉండగా, ఈ టెలీప్లే గతము నుండి ఒక నిర్దిష్ట యుగము గురించి ప్రేక్షకులకు తెలియజేస్తుంది మరియు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.”
బహుభాషా కంటెంట్ యొక్క ప్రాముఖ్యత పెరగడము గురించి, ఆమె ఇలా అన్నారు, “టెలీప్లేను రెండు వేరువేరు భాషలలోకి, తెలుగు మరియు కన్నడ, అనువదించడము అనేది, థియేటర్ లక్షణాలు మరియు ప్రేక్షకులకు ఒక విన్-విన్ పరిస్థితి.”
టెలీప్లే ఫార్మాట్ ఫార్మాట్ గురించి అన్వేషించడాన్ని ఆమె ఆనందించారు మరియు ఇలా అన్నారు “ఒక టెలీప్లేలో నటించడం నాకు ఇదే మొదటిసారి మరియు ఇది ఎంతో సరదాగా సాగింది. ఒక నటికి లేదా నటుడికి థియేటర్ ఎంతో నేర్పుతుంది మరియు ఇది సినిమా మరియు థియేటర్ యొక్క సమ్మేళనము కాబట్టి, ఈ ఫార్మాట్ నుండి నేను కూడా ఎంతో నేర్చుకున్నాను.”
ఇషాన్ త్రివేది దర్శకత్వం వహించిన ఈ జీ థియేటర్ టెలీప్లేలో రజత్ కౌల్ మరియు రాకీ కూడా నటించారు. దీన్ని ఆగస్ట్ 11న Airtel స్పాట్‌లైట్, Dish TV రంగ్‌మంచ్ యాక్టివ్ & D2h రంగ్‌మంచ్ యాక్టివ్‌లో చూడండి