హైదరాబాద్, ఏప్రిల్ 23 : హైదరాబాద్ లోని హయత్ నగర్ మండలం తారామతి పేట్ మాజీ సర్పంచ్ వడ్డేపల్లి పాపయ్య గౌడ్ సోదరుడు బాలయ్య గౌడ్ కుమార్తె చి.ల.సౌ మౌనిక వివాహం శ్రీమతి & శ్రీ గుణగంటి మంగ-స్వామి కుమారుడు సంతోష్ గౌడ్ తో వైభవంగా జరిగింది. బుధవారం (23-ఏప్రిల్-2025) రోజు ఉదయం 10.45 నిమిషములకు మిథున లగ్న సుమూహూర్తమున జరిగిన ఈ కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో హాజరైన బంధు మిత్రులు నూతన వధూవరులైన మౌనిక -సంతోష్ గౌడ్ లపై అక్షింతలు వెదజల్లుతూ ఈ జంట కలకాలం అన్యోన్యంగా సుఖమయమైన జీవితం గడపాలని, నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో, పిల్లాపాపలతో విలసిల్లాలని కోరుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మేట్ మండలం తారామతి పేట్ ఎన్. జె.కె. కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ మౌనిక -సంతోష్ గౌడ్ ల ళ్యాణోత్సవంలో నంది అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి అబ్దుల్, సీనియర్ జర్నలిస్ట్ జి. శ్రీనివాస్ , సినీ నటుడు, సీనియర్ జర్నలిస్ట్ మారుపాక గోవర్ధనరెడ్డి తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.