ఘనంగా ‘జయహో రామానుజ’ సినిమా లిరికల్ సాంగ్స్ లాంఛ్

0
82
The lyrical songs of the movie 'Jayaho Ramanuja' were launched grandly
The lyrical songs of the movie 'Jayaho Ramanuja' were launched grandly
లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'జయహో రామానుజ'. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల 'జయహో రామానుజ' సినిమా పాటలను తిలకించిన తెలంగాణ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లయన్ సాయి వెంకట్ కు అభినందనలు అందజేశారు. పాటలు బాగున్నాయంటూ వారు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 'జయహో రామానుజ' లిరికల్ సాంగ్స్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - 'జయహో రామానుజ' సినిమా చేయాలనేది నా మిత్రుడు లయన్ సాయి వెంకట్ కల. తన కలను నెరవేర్చుకున్న సంతోషంలో ఆయనలో కనిపిస్తోంది. 'జయహో రామానుజ' పాటలు చాలా బాగున్నాయి. భక్తితో పాటు సామాజిక చైతన్యాన్ని అందించేలా పాటలను రూపకల్పన చేశారు. ఇలాంటి మరిన్ని గొప్ప చిత్రాలను సాయి వెంకట్ రూపొందించాలి. ఈ సినిమా నా మిత్రుడికి గొప్ప విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ - కులమతాలు సమాజంలో విబేధాలు తీసుకురావొద్దనే గొప్ప సందేశాన్ని వెయ్యేళ్ల కిందటే ఇచ్చిన గురువు శ్రీ రామానుజాచార్యులు. ఆయన జీవిత కథతో సినిమా చేయడం లయన్ సాయి వెంకట్ చేసుకున్న అదృష్టం. సినిమాను ఎంతో వ్యయప్రయాసలతో ఆయన రూపొందించాడు. ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ అన్నీ చూశాం. చాలా బాగున్నాయి. పాటలు 'జయహో రామానుజ' చిత్ర విజయంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. లయన్ సాయి వెంకట్ కు ఈ సినిమా చిరకాల కీర్తిని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ - 'జయహో రామానుజ' చిత్ర సాంగ్స్ బిగ్ సీడీ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. భక్తిని, చైతన్యాన్ని అందించేలా సంగీత సాహిత్యాలు కుదిరాయి. 'జయహో రామానుజ' సినిమా ఈతరం ప్రేక్షకులు చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమా రూపొందించడం సాధారణ విషయం కాదు. సాయి వెంకట్ ఎంతో ఇష్టంతో, భక్తితో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆయనకు 'జయహో రామానుజ' మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.
ఎఫ్ డీసీ మాజీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ - 'జయహో రామానుజ' చిత్ర పాటల విడుదల కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన లయన్ సాయి వెంకట్ గారికి కృతజ్ఞతలు. పాటలు చాలా బాగున్నాయి. సినిమాకు ఈ పాటలన్నీ మంచి ఆకర్షణ అవుతాయి. ప్రేక్షకులు థియేటర్ లో ఈ సినిమాను అందులో పాటలను బాగా ఆస్వాదిస్తారని అనిపిస్తోంది. సమాజానికి మంచిని చెప్పే ఇలాంటి గొప్ప సినిమా రూపొందించిన సాయి వెంకట్ గారికి నా అభినందనలు తెలుపుతున్నా. అన్నారు.
దర్శకుడు, హీరో డా.లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ - ఇటీవల మా 'జయహో రామానుజ' సినిమా పాటలను మన ప్రియతమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చూపించడం జరిగింది. వారు పాటలన్నీ తమకు బాగా నచ్చాయంటూ ప్రశంసిస్తూ ఆశీస్సులు అందజేశారు. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ రోజు మా 'జయహో రామానుజ' సినిమా లిరికల్ సాంగ్స్ రిలీజ్ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా ఈవెంట్ కు వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రంలోని పాటల రూపకల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. సంగీత సాహిత్యాలు గొప్పగా ఉండాలని ఎంతో టైమ్ తీసుకుని ఖర్చుకు వెనకాడకుండా సాంగ్స్ డిజైన్ చేశాం. మీ అందరికీ మా మూవీ సాంగ్స్ నచ్చాయని ఆశిస్తున్నాం. మహిళల్ని గౌరవించాలని, కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో మానవాళి ఉండాలని సందేశాన్ని ఇచ్చిన గొప్ప గురువు భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారు. ఆయన గొప్పదనం ఈ తరం వారికి తెలియాలనే ఉద్దేశంతో జయహో రామానుజ చిత్రాన్ని రూపొందించాను. జయహో రామానుజ చిత్రంతో ఆయన గొప్పదనం తెలియజేయాలని సంకల్పించాను. జయహో రామానుజ సినిమా రూపకల్పనకు రెండేళ్ల సమయం పట్టింది. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. అన్నారు.
నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ - 'జయహో రామానుజ' సినిమా పాటలన్నీ మీకు నచ్చాయని నమ్ముతున్నాం. నాన్న సినిమా కోసం ఎంత శ్రమించారో ఈ పాటలు అందంగా తీసుకొచ్చేందుకు అంతే జాగ్రత్తలు తీసుకున్నారు. 'జయహో రామానుజ' సినిమా నాన్నగారికి ఒక కల. ఈ సినిమా చిత్రీకరణలో పిల్లలుగా మమ్మల్ని కూడా భాగస్వాములను చేశారు. భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా 'జయహో రామానుజ' సినిమా ఉంటుంది. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. మీరంతా మీ ఆదరించి ఘన విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.