రిటైన్‌ చేసుకుంటున్న ప్లేయర్ల లిస్టు ఇంటర్నెట్‌లో వైరల్‌!

0
27
The list of retained players is viral on the internet!
The list of retained players is viral on the internet!

ఐపీఎల్‌ వేలానికి సంబంధించిన రిటెన్షన్‌ నిబంధనలను ఇటీవలే బీసీసీఐ ఖరారు చేసింది. మొత్తంగా ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది. త్వరలోనే 2025 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మెగా వేలం జరగనుంది. దీంతో రిటైన్‌ చేసుకునే ప్లేయర్ల లిస్టును ప్రిపేర్‌ చేయడంలో ఫ్రాంచైజీలు బిజీగా ఉన్నాయి. అయితే కొందరు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం, రిలీజ్‌ చేసే విషయంలో ఫ్రాంచైజీలు ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. పది ఫ్రాంచైజీలు రిటైన్‌ చేసుకుంటున్న ప్లేయర్ల లిస్టు ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. లీక్‌ అయిన జాబితాలోని ఆటగాళ్లను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు! రాబోయే సీజన్‌లో భారత, విదేశీ ఆటగాళ్ల సహా ప్రతి జట్టు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్‌ చేసుకోవచ్చు. జట్లు వారు అట్టిపెట్టుకుంటున్న ఆటగాళ్ల సంఖ్య ఆధారంగా స్పెసిఫిక్‌ అమౌంట్‌ని తప్పనిసరిగా చెల్లించాలి. రిటైన్‌ చేసుకుంటున్న మొదటి, నాలుగో ప్లేయర్‌కి రూ.18 కోట్లు కేటాయించాలి. అలానే రెండు, ఐదో ప్లేయర్‌కి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు చెల్లించాలి. టీమ్‌లు ఇద్దరు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌లను రిటైన్‌ చేసుకోవడానికి కూడా అనుమతి ఉంది. భారత్‌ తరఫున ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడని ఆటగాళ్లను అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌లు పేర్కొంటారు. వీరికి ఒక్కొక్కరికి రూ.4 కోట్లు చెల్లించాలి. అలానే గతంలో టీమ్‌ ఇండియాకి ఆడిన ఆటగాడు, దాదాపు ఐదేళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉంటే కూడా అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా గుర్తిస్తారు. అదనంగా వేలం సమయంలో జట్లకు రైట్‌ టు మ్యాచ్‌ ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మరొక ఫ్రాంచైజీ చేసిన అత్యధిక బిడ్‌ను ఆఫర్‌ చేయడం ద్వారా ఆటగాడిని తిరిగి కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ సంవత్సరం ఒక కొత్త ట్విస్ట్‌ ఉంది. ఓ ఫ్రాంచైజీ ని ఉపయోగిస్తే, అత్యధిక బిడ్డర్‌ తమ ఆఫర్‌ను అంతకంటే పెంచవచ్చు. దీంతో పోటీ ఆసక్తికరంగా మారుతుంది. టాప్‌ ప్లేయర్‌లకు ఎక్కువ మొత్తం లభిస్తుంది. నివేదికల ప్రకారం, ముంబై ఇండియన్స్‌ నలుగురు కీలక ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యాని కొనసాగించాలని నిర్ణయించుకుంది. గత సీజన్‌లో ఫెయిలైన హార్దిక్‌ని కెప్టెన్‌గా కొనసాగిస్తారా? లేదా? అనేది అస్పష్టంగానే ఉంది.పంజాబ్‌ కింగ్స్‌ కేవలం ఒక ఆటగాడు అర్ష్‌దీప్‌ సింగ్‌ను మాత్రమే ఉంచుకుంది. గత సీజన్‌లో అద్భుతంగా రాణించిన అన్‌క్యాప్డ్‌ స్టార్లు శశాంక్‌ సింగ్‌, అశుతోష్‌ శర్మను వదులుకుంది. లక్నో ఫ్రాంచైజీ కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా కొనసాగించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నికోలస్‌ పూరన్‌, మయాంక్‌ యాదవ్‌, ఆయుష్‌ బదోని లేదా మొహ్సిన్‌ ఖాన్‌లో ఒకరిని రిటైన్‌ చేసుకోవాలని నిర్ణయించుకుంది.
ఫ్రాంచైజీలు రిటైన్‌ చేస్తున్న ప్లేయర్ల జాబితా

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: పాట్‌ కమిన్స్‌, అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌
  • రాజస్థాన్‌ రాయల్స్‌: సంజు శాంసన్‌, రియాన్‌ పరాగ్‌, ధృవ్‌ జురెల్‌
  • కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: శ్రేయాస్‌ అయ్యర్‌, ఆండ్రీ రస్సెల్‌, సునీల్‌ నరైన్‌, హర్షిత్‌ రానా
  • రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: విరాట్‌ కోహ్లీ, ఫాఫ్‌ డు ప్లెసిస్‌, మహ్మద్‌ సిరాజ్‌
  • ముంబై ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా
  • ఢల్లీ క్యాపిటల్స్‌: రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, జేక్‌ ఫ్రేజర్‌/కుల్దీప్‌
  • పంజాబ్‌ కింగ్స్‌: అర్ష్‌దీప్‌ సింగ్‌
  • లక్నో సూపర్‌ జెయింట్స్‌: నికోలస్‌ పూరన్‌, మయాంక్‌ యాదవ్‌, ఆయుష్‌ బదోని/మొహ్సిన్‌ ఖాన్‌
  • చెన్నై సూపర్‌ కింగ్స్‌: రవీంద్ర జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌, శివం దూబే, ఎంఎస్‌ ధోని
  • గుజరాత్‌ టైటాన్స్‌: శుభమాన్‌ గిల్‌, రషీద్‌ ఖాన్‌