రవాణా శాఖలో జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనల అమలుకు  కేంద్ర ప్రభుత్వం సన్నాహాకాలు

0
68

మైనర్లు పట్టుబడితే 25,000 జరిమానా.. రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలుకు  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. రోడ్డు ప్రమాదాలు చెక్ పెట్టేందుకు మైనర్లు వాహనం నడిపిన మైనర్లకు వాహనం ఇచ్చిన ఇక ప్రభుత్వం సీరియస్గా పరిగణించనుంది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మైనర్లు వాహనం నడిపితే రూ. 25 వేల రూపాయల జరిమానా తో పాటు వారు  25 ఏళ్ల వచ్చేవరకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా కేంద్రం నిషేధించనుంది.    అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 1000 నుంచి రూ.2000వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500, అతివేగంతో పట్టుబడితే రూ. 1000 నుంచి 2000 వరకు జరిమానాను విధించనుంది. ఈ నూతన నిబంధనలు జూన్ 1 నుండి అమలులోకి రానున్నాయి. ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేకుండా లైసెన్స్ కావాలనుకునేవారు డ్రైవింగ్ స్కూల్ కి వెళ్లి అక్కడ లైసెన్స్ పొందవచ్చు. గుర్తింపు పొందిన ప్రైవేటు డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి డ్రైవింగ్ పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం ఉంటుంది. ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లకు ప్రభుత్వం సర్టిఫికెట్లు మంజూరు చేసి ఈ పరీక్షలు నిర్వహించడానికి వారికి అధికారం ఇవ్వనుంది.