‘కహో నా…. ప్యార్ హై’ (2000) లో మనోహరమైన అతిథి పాత్రలో నటించిన తన్నాజ్ ఇరాని అనేక హిట్ సినిమాలలో నటించింది మరియు టెలివిజన్ లో మరియు థియేటర్ లో కూడా సముచిత స్థానం సంపాదించుకుంది. ఈ నటి జీ థియేటర్ టెలీప్లే ‘అంతర్ద్వాండ్’ లో నటించింది, ఇది ఇప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల కొరకు తెలుగులోకి కూడా అనువదించబడింది.
‘అంతర్ద్వాండ్’ లో కీలక పాత్రలో నటించినందుకు తన్నాజ్ చాలా ఆనందించింది. ఈ టెలీప్లే దోషిగా నిర్ధారించబడిన ఒక హంతకుడు మరియు ధృవీకరించదగిన పిచ్చిమనిషి సదా యొక్క కథ. అతను డా. శ్రీధర్ మానసిక వైద్యశాలలో అకస్మాత్తుగా కనిపించినప్పుడు అనేక ఆశ్చర్యాలు ముందుకు వస్తాయి.
టెలీప్లే ఫార్మాట్ గురించి మాట్లాడుతూ ఈ నటి ఇలా అన్నారు, “అంతర్ద్వాండ్’ చిత్రీకరించబడుతుంది అనే ఆలోచనే దీనిలో భాగం కావడానికి నాకు ఆనందాన్ని ఇచ్చింది అని నేను అనుకుంటున్నాను. కాన్వాస్ మనము థియేటర్ లో ఉపయోగించేటటువంటిదే మరియు తారాగణం కూడా ఆసక్తికరంగా ఉంది. ఒక థియేటర్ వ్యక్తిగా, వేదికకు సంబంధించినది ఏదైనా చేయాలని ఎప్పుడు అనుకుంటాను.”
ఫార్మాట్ కు సంబంధం లేకుండా, నటన యొక్క క్రాఫ్ట్ చాలా ముఖ్యమైన అంశం అని ఆమె తన అభిప్రాయం వెల్లడిస్తూ ఇలా చెప్పుకొచ్చారు, “వేదిక పైన, వ్యక్తులతో ఇంటరాక్ట్ కావడముతో పాటు, ఆడిటోరియంలో ఒక వ్యక్తిగత ప్రకంపనలు సృష్టించబడతాయి. సినిమాలో, క్రాఫ్ట్ వేరుగా ఉంటుంది. ఇక్కడ, తెర పెద్దది కాబట్టి మరియు ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చూపుతుంది కాబట్టి, మీరు మీ వ్యక్తీకరణలను నియంత్రణలో ఉంచుకోవాలి. టెలివిజన్ లో, మీరు మీ పాత్రను చాలా కాలం నటించవలసి ఉంటుంది”.
కులకర్ణిచే వేదిక కొరకు దర్శకత్వం వహించబడిన మరియు చిత్రీకరించబడిన ఈ టెలీప్లేలో తన్నాజ్ తో కలిసి పంకజ్ బెర్రి, గోపాల్ సింగ్, అదితి గోవిత్రికర్, అద్నాన్ ఖాన్ మరియు నమ్య సక్సేనా నటించారు. దీనిని టాటా ప్లే థియేటర్ లో చూడండి.