- వైభవంగా 4న ప్రదానోత్సవం
ప్రతి సంవత్సరం ‘సూర్య చంద్ర’ సంస్థ అందించే అత్యుత్తమ అవార్డులు ఈ ఏడూ ‘రాన్సాక్ ఆర్గా’కు దక్కడం విశేషమే అని చెప్పాలి. ‘రాన్సాక్ ఆర్గా’ సంస్థకు చెందిన సి.ఈ.ఓ చింతల చెర్వు భరద్వాజ్ తో పాటు బెస్ట్ యూ -ట్యూబర్ గా మాలోతు బిచ్చునాయక్, ఓరుగంటి సర్వేశ్వరరావు (సి.ఏ), ఓరుగంటి నీలీమ ( అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ పొలిటికల్ సైన్స్ ), జి. వంశీకృష్ణ- ప్రకృతిలకు ‘సూర్య చంద్ర 2024’కు సంబంధించి జాతీయ స్థాయిలో అత్యుత్తమ అవార్డులు అందజేయ నున్నట్టు ఆ సంస్థ అధ్యక్షుడు పల్లె మోహన చంద్ర, ప్రధాన కార్యదర్శి డా. శ్రీనివాస్ శర్మ తెలిపారు. ఈ నెల 4 ఆదివారం 2 గంటలకు హైదరాబాద్ లోని జి.పి బిర్లా హాల్ లో ప్రారంభమయ్యే ఈ అత్యుత్తమ అవార్డుల ప్రదానోత్సవానికి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, పి.వి. నారాయణరావు (సి.ఏ), రిటైర్డ్ జడ్జి బి.మధు సూధన్ ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఎంతో వైభవంగా జరిగే ఈ సూర్య చంద్ర అత్యుత్తమ అవార్డుల ప్రదానోత్సవంలో లయన్ డా. సి.హెచ్ రాజశేఖర్ రెడ్డి, మెట్రో టీవీ ఎం.డి కె.జయప్రసాద్, డా. కృష్ణమాచారి, ప్రఖ్యాత కవయిత్రి, రచయిత్రి సముద్రాల శ్రీదేవి, డా. వి.బి వసంతరాయలు, రాజేంద్రకుమార్ పొన్న, యాంకర్ మీనాక్షి తదితరులు పాల్గొననున్నారని అధ్యక్షుడు పల్లె మోహన చంద్ర తెలిపారు. సూర్య చంద్ర అత్యుత్తమ అవార్డుల ప్రదానోత్సవానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని శ్రీలత స్టూడెంట్స్ శ్రీమతి మాధవి మరియు మీనాక్షి స్టూడెంట్స్ తమ ప్రతిభతో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను అలరించనున్నారని చెప్పారు.