టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హీరో సుహాస్… ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజి బ్యాండ్, ప్రసన్నవదనం సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు ఆయన నటించిన మూవీ శ్రీరంగనీతులు అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాలో సుహాస్ తో పాటు కేరాఫ్ కంచరపాలెం తో ఆకట్టుకున్న కార్తీక్‌రత్నం, బేబీ తో యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న విరాజ్ అశ్విన్, రుహానిశర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నలుగురి పెర్ఫార్మెన్స్ శ్రీరంగనీతులు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యూనిక్ కంటెంట్ తో డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో రూపొందిన ఈ చిత్రానికి వీఎస్ఎస్ ప్రవీణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఓటీటీ ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రస్తుతం ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.