
పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శ్రీరామ్. ఆయన నటించిన కొత్త సినిమా “నిశ్శబ్ద ప్రేమ”. ఈ చిత్రంలో ప్రియాంక తిమ్మేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సెలబ్రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత కార్తికేయన్.ఎస్ నిర్మించారు. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు రాజ్ దేవ్ రూపొందించారు. “నిశ్శబ్ద ప్రేమ” సినిమా ఈ నెల 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్, సాంగ్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్, నిర్మాత చింతపల్లి రామారావు నిర్మాత రాజేశ్ పుత్ర, డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ ట్రైలర్ లాంఛ్ చేయగా, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ సాంగ్ విడుదల చేశారు
ఈ సందర్భంగా..
డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ మాట్లాడుతూ – “నిశ్శబ్ద ప్రేమ” చిత్రంతో మా పరిటాల రాంబాబు డిస్ట్రిబ్యూటర్ గా మారడం సంతోషంగా ఉంది. తమిళంలో ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసింది. లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా. హీరో శ్రీరామ్ మరో మంచి మూవీతో మన ముందుకు రాబోతున్నారు. “నిశ్శబ్ద ప్రేమ” సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ – “నిశ్శబ్ద ప్రేమ” చాలా మంచి టైటిల్. శ్రీరామ్ గారు మన తెలుగు హీరో. ఆయన రోజాపూలు సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. వయలెన్స్ కంటే సైలెన్స్ శక్తి ఉన్నది. “నిశ్శబ్ద ప్రేమ” సినిమాలో ఒక మంచి మూవీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. అలాగే నిర్మాత కార్తికేయన్ ఫారెన్ లో జాబ్ చేస్తూ సినిమా మీద ఫ్యాషన్ తో వచ్చి ఈ సినిమా రూపొందించారు ఆయన మంచి అభిరుచి గల నిర్మాత అని అర్థమవుతుంది అటువంటి ఆయన త్వరలో తెలుగులో కూడా సినిమా తీయాలని కోరుకుంటున్నాను . అలాగే డిస్ట్రిబ్యూటర్ గా వస్తున్న మన పరిటాల రాంబాబుకు సక్సెస్ దక్కాలని కోరుకుంటున్నా. “నిశ్శబ్ద ప్రేమ” సక్సెస్ మీట్ లో మరోసారి మనమంతా కలుద్దాం. అన్నారు.
నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ – “నిశ్శబ్ద ప్రేమ” సినిమా హీరో శ్రీరామ్ గారికి మంచి సక్సెస్ ఇవ్వాలి. ఆయన తెలుగులో మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. డిఫరెంట్ లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు రాజ్ దేవ్ రూపొందించారు. తమిళంలో ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ కావాలి. నిర్మాత కార్తికేయన్. ఎస్. ప్యాషనేట్ స. సరికొత్త థ్రిల్లర్ లవ్ స్టోరీగా “నిశ్శబ్ద ప్రేమ” సినిమా మీ ముందుకు రాబోతోంది. ఈ నెల 23న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. తెలుగు ఆడియెన్స్ కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అన్నారు.
నటుడు వియాన్ మాట్లాడుతూ – నేను మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చాను. నా ఫస్ట్ తమిళ్ మూవీ ఇది. తెలుగులో నాకు చాలా మంది ఫేవరేట్ హీరోస్ ఉన్నారు. “నిశ్శబ్ద ప్రేమ” చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ గార్లకు థ్యాంక్స్. “నిశ్శబ్ద ప్రేమ” సినిమాకు మీ సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాం. అన్నారు.
డైరెక్టర్ రాజ్ దేవ్ మాట్లాడుతూ – “నిశ్శబ్ద ప్రేమ” ట్రైలర్, సాంగ్ లాంఛ్ కు వచ్చిన గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. మా మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. “నిశ్శబ్ద ప్రేమ” సినిమా తమిళంలో మంచి ఆదరణ పొందింది. తెలుగులో ఈ నెల 23న రిలీజ్ కు వస్తోంది. తెలుగు ఆడియెన్స్ కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
హీరోయిన్ ప్రియాంక తిమ్మేష్ మాట్లాడుతూ – “నిశ్శబ్ద ప్రేమ” సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన శ్రీరామ్ గారికి, ప్రొడ్యూసర్ కార్తికేయన్, డైరెక్టర్ రాజ్ దేవ్ గారికి థ్యాంక్స్. ఈ నెల 23న మా “నిశ్శబ్ద ప్రేమ” సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా థియేటర్స్ కు వెళ్లి మా మూవీని చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో శ్రీరామ్ మాట్లాడుతూ – “నిశ్శబ్ద ప్రేమ” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్న ప్రసన్నకుమార్ గారికి, వీరశంకర్ గారికి, రామారావు గారికి ఇతర గెస్ట్ లకు థ్యాంక్స్. లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిపిన గ్రిప్పింగ్ మూవీ ఇది. ఏమాత్రం మిమ్మల్ని నిరాశపర్చదు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇలాంటి టీమ్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. తమిళంలో హిట్ అయిన తర్వాత కూడా ఎంతో ప్రయాసపడి తెలుగులోకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు మా ప్రొడ్యూసర్, డైరెక్టర్. వారికి థ్యాంక్స్ చెబుతున్నా. మంచి సినిమాకు భాషా హద్దులు లేవు. ఏ భాషలోని సినిమా అయినా కంటెంట్ ఉంటే మరో చోట తప్పకుండా ఆదరణ పొందుతుంది. “నిశ్శబ్ద ప్రేమ” సినిమా సక్సెస్ మీద కూడా అలాంటి నమ్మకమే మా అందరికీ ఉంది. అన్నారు.
నటీనటులు – శ్రీరామ్, ప్రియాంక తిమ్మేష్, హరీశ్ పెరడి, వియాన్, నిహారిక పాత్రో, తదితరులు.
టెక్నికల్ టీమ్:
లైన్ ప్రొడ్యూసర్ ఎ. జెపి ఆనంద్
స్టంట్ – మిరాకిల్ మైఖేల్
కొరియోగ్రఫీ – దినేష్
డీవోపీ – యువరాజ్.ఎం
ఎడిటర్ – మదన్.జి
మ్యూజిక్ డైరెక్టర్ – జుబిన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – పరిటాల రాంబాబు
పీఆర్ఓ – వీరబాబు
బ్యానర్ – సెలెబ్రైట్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్ – కార్తికేయన్.ఎస్
డైరెక్టర్ – రాజ్ దేవ్