షైన్ టామ్ చాకో రొమాంటిక్ కామెడీ డ్రామా ‘వివేకానందన్ వైరల్’ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్

0
13
Shine Tom Chacko Romantic Comedy Drama 'Vivekanandan Viral' streaming on Aha OTT
Shine Tom Chacko Romantic Comedy Drama 'Vivekanandan Viral' streaming on Aha OTT

మలయాళంలో షైన్ టామ్ చాకోకి మంచి క్రేజ్ ఉంది. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే పవర్ ఫుల్ విలనిజం పండించడం ఆయన నైజం. అలాంటి ఆయన డిఫరెంట్ కంటెంట్‌తో కూడిన ‘వివేకానందన్ విరలను’ అనే సినిమా చేశారు. గత ఏడాది జనవరి 19న విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం అచ్చ తెలుగు ఓటీటీ ‘ఆహా’ స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయింది. తన సబ్‌స్క్రైబర్ల కోసం ప్రతి శుక్రవారం కొత్త సినిమాలను అందించే ఆహా ఓటీటీ ఈ శుక్రవారం ‘వివేకానందన్ వైరల్’ పేరుతో సరికొత్త రొమాంటిక్ కామెడీ డ్రామాను అందించబోతోంది.
ఈ సినిమాలో షైన్ టామ్ చాకో సరసన ఐదుగురు హీరోయిన్స్ కనిపిస్తారు. శ్వాసిక విజయ్, గ్రేస్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేశ్, మంజు పిళ్లై ముఖ్యమైన పాత్రలను పోషించారు. కామెడీ డ్రామా జోనర్లో రూపొందిన ఈ సినిమాకి సీనియర్ దర్శకుడు కమల్ దర్శకత్వం వహించారు.
‘వివేకానందన్ వైరల్’ కథ విషయానికి వస్తే.. ఇద్దరు భార్యలను చేసుకొని, వాళ్లను వేధిస్తూ తిరిగే ఓ భర్త.. అతనికి బుద్ది చెప్పేందుకు వాళ్లు చేసే ప్రయత్నం చుట్టూ తిరిగే కథ ఇది. వివేకానందన్ మంచి విలాస పురుషుడు .. ఆపై శృంగార పురుషుడు. ఆయన భార్య సితార ఓ పల్లెటూళ్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తన జాబ్ సిటీలో కావడం.. భార్య ఇంట్లో లేకపోవడంతో వివేకానందన్ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాడు. అతని నిజస్వరూపం తెలుసుకున్న వాళ్లంతా కలిసి ఏం చేశారు? వివేకానందన్ ఎలాంటి చిక్కుల్లో పడతాడు? అనేది అసలు కథ.
ఆకట్టుకునే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ప్రతి క్షణం ఆసక్తిగా ఎంటర్‌టైన్ చేసే ‘వివేకానందన్ వైరల్’ సినిమాను భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీ ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. షైన్ టామ్ చాకో 100వ చిత్రంగా వచ్చిన ఈ సినిమాను రేపు ఆహా ఓటీటీలో అసలు మిస్ అవ్వకుండా చూసేయండి.