తెలుగు సినిమాకు అంజలిదేవి తొలి గ్లామర్ హీరోయిన్ అయితే, సావిత్రి తొలి స్టార్ హీరోయిన్. గొల్లభామ సినిమాలో అంజలిదేవి చేసిన డాన్సులే స్టేజిమీద సావిత్రి చేస్తూ వుండేది. సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తూ వుండేది. చరణదాసి సినిమాలో వాళ్లిద్దరూ తొలి సారి కలిసి నటించారు. ఆరోజుల్లో ఒక్క సావిత్రి మాత్రమే కాదు జమున, కృష్ణకుమారి వంటి అగ్ర కథానాయికలు కూడా అంజలి అంటే ప్రాణం పెట్టేవారు. అక్కా అక్కా అంటూ వెంట తిరిగేవారు. అంజలి దేవి తీసిన “అమ్మకోసం” సినిమా ప్రారంభోత్సవానికి సావిత్రమ్మే ముఖ్య అతిధి. మీరు చూస్తున్న ఫోటో “అమ్మకోసం” సినిమా ప్రారంభోత్సవ సమయంలోనిదే … అంజలీదేవితో సావిత్రి, శారద, గిరిజ లను ఈ ఫోటోలో మీరు చూడవచ్చు.