హైదరాబాద్: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ట్రావెల్ ఏజెన్సీలలో ఒకటిగా హైదరాబాద్‌కు చెందిన ఆర్ ఎల్
టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుకుసాగుతుంది. ఈ రోజు హైదరాబాద్‌లో ఆర్ ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తన 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఎయిర్ టికెటింగ్, గ్రూప్ ప్యాకేజీలు, వీసాలు, ఫారెక్స్, ప్రయాణ బీమా తదితర అన్ని సేవలను ఒకే గొడుగు కింద ఈ సంస్థ అందిస్తుంది. మాక్సివిజన్, క్లౌడ్‌టారో, గ్నాపికా ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్. జి మూవీ మేకర్స్ తదితర ప్రతిష్టాత్మక కార్పొరేట్ సంస్థలన్నింటికి ఈ సంస్థనే సేవలందిస్తుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS), (NATA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మరియు మరెన్నో సహా అనేక లాభాపేక్ష లేని సంస్థలలో భాగంగా వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలో ప్రముఖ ప్రయాణికుడు మరియు గ్లోబ్ ట్రాటర్ సీఈవో అనురాధ చెట్టితో పాటు మేనేజింగ్ డైరెక్టర్స్ ఆర్ ఎల్ ఎండీ రాజ్ అల్లడ & ప్రముక గాయిని గీతామాధురి ఈ కార్యక్రమంలో సినీనటి సుమ, రాజీవ్ కనకాల, సింగర్స్ సునీత, ఆర్.పి. పట్నాయక్, కౌసల్య, సింహ మరియ మరికొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు.