తెలంగాణ సినీ కార్మికులకు పని కల్పించండి: టి.ఎఫ్.సి.సి చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్

0
8
Provide work to Telangana film workers: TFCC Chairman Dr. Pratani Ramakrishna Goud
Provide work to Telangana film workers: TFCC Chairman Dr. Pratani Ramakrishna Goud

టుడుగా, నిర్మాతగా, దర్శకునిగా,డిస్ట్రిబ్యూటర్ గా, తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గా డా. ప్రతాని రామకృష్ణ గౌడకు తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. తన 35 ఏళ్ల సినీ ప్రయాణంలో, 41 చిత్రాలను నిర్మించి, 8 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 250 కి పైగా చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. మే 18వ తేదీ ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆర్ కె ఫిలిమ్స్ పతాకంపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో “ఉమెన్స్ కబడ్డీ” అనే ఓ సరికొత్త నూతన చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే “దీక్ష’ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని జూన్ నెలలో రిలీజ్ కు రెడీ అవుతోంది. కిరణ్, ఆలేఖ్య రెడ్డి, ఆక్సఖాన్, తులసి హీరో హీరోయిన్స్ గా నిర్మించిన దీక్ష చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.ఒక్క టికెఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ లోనే 15 రోజులు షూటింగ్ జరుపుకుంది. దీక్ష తో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే కాన్సెప్ట్ తో దర్శకుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో అద్భుతమైన 5 పాటలున్నాయి. రాజ్ కిరణ్ సంగీత సారధ్యంలో మధుప్రియ, గీతామాధురి పాటల్ని పాడారు. 5 అద్భుతమైన ఫైట్స్ మాస్టర్ రవి కంపోజ్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాత డా. ఆర్ కె గౌడ్.
కార్మికులకు పని కల్పించండి. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి 11 సంవత్సరాలు పైగా అవుతోంది. రెండు రాష్ట్రాల్లో ఎఫ్ డి సి లు ఏర్పడ్డాయి. కానీ తెలంగాణా సినీ కార్మికులు పని లేక అష్ట కష్టాలు పడుతూ, వివక్షకు గురవుతూనే వున్నారు. తెలంగాణా ఎఫ్ డి సి, తెలంగాణా ప్రాంత కార్మికులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక్కడ కూడా ఎంతోమంది ప్రతిభగల అద్భుతమైన టెక్నిషియన్స్ వున్నారు. వాళ్లకు అవకాశం ఇవ్వండి. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫిల్మ్ చాంబర్స్ అందరూ కలసి 50శాతం పని తెలంగాణా కార్మికులకు, మిగతా 50 శాతం ఇతర ప్రాంతాల కార్మికులకు పని కల్పించేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను అన్నారు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here