ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ 2025 సంవత్సరపు నూతన డైరీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన క్యాంప్ కార్యాలయం లో శుక్రవారం నాడు విడుదల చేశారు.ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షులు ఎల్.వేణుగోపాలనాయుడు, ప్రధాన కార్యదర్శి ఆర్.రవికాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు కె.శ్రీకాంత్రావు, సంయుక్త కార్యదర్శి చిలుకూరి హరిప్రసాద్, కార్యవర్గ సభ్యులు బ్రహ్మండభేరి గోపరాజు, పి.బాపురావు, టి.శ్రీనివాస్ తదితరులు డైరీ ఆవిష్కరణలో పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ సందర్బంగా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తుందని భట్టి తెలిపారు.ప్రెస్ క్లబ్ కు స్థలాన్ని కేటాయించాలని అధ్యక్ష , ప్రధానకార్యదర్శులు, పాలకమండలి ఉపముఖ్యమంత్రిని కోరారు. ప్రభుత్వం నుంచి ప్రెస్ క్లబ్ కు ముఖ్యంగా జర్నలిస్టులకు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని భట్టి హామీనిచ్చారు. సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ కు ప్రస్తుత స్థలం కేటాయింపు కోసం ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ పాలకమండలి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి పూల మొక్కను బహూకరించి శాలువాతో సత్కరించారు.