అశ్విన్ బాబు చిత్రం ‘వచ్చిన వాడు గౌతమ్’ నుండి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల

0
3
Powerful first look from Ashwin Babu's film 'Vachina Vadu Gautham' released
Powerful first look from Ashwin Babu's film 'Vachina Vadu Gautham' released

డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు నుండి వస్తున్న మరో ఎక్సయిటింగ్ మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’. మెడికల్ యాక్షన్ మిస్టరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి లావిష్ గా నిర్మిస్తున్నారు. గోల్డ్ లైన్ క్రియేషన్స్, ప్రవల్లిక యోగి కో – ప్రొడ్యూసర్. బ్లెడ్ అండ్ స్టెత్ తో ఉన్న అశ్విన్ బాబు లుక్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రంలో సాయి రోణక్ కేమియో పాత్ర లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో అశ్విన్ బాబు తో పాటు, రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్, ఖేడేకర్, అభినయ, అజయ్, VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ, అమర దీప్, అభిత్ భూషణ్, నాగి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. గౌర హరి మ్యూజిక్ అందిస్తుండగా, ఎం. ఎన్ బాల్ రెడ్డి డీవోపీ, M R వర్మా ఎడిటర్. సురేష్ భీమగని ఆర్ట్ డైరెక్టర్  గా పని చేస్తున్నారు. ఈ చిత్రం 90% షూటింగ్ పూర్తి చేసుకుంది. బేలన్స్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, పూర్తి చేసుకుని, త్వరలో మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు.
నటీనటులు: అశ్విన్ బాబు, రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అభినయ, అజయ్, అమర్ దీప్, VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ,అభిత్ భూషణ్,నాగి.
సాంకేతిక నిపుణులు :
స్టోరీ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ : మామిడాల ఎం. ఆర్. కృష్ణ
నిర్మాత : T. గణపతి రెడ్డి’
కో – ప్రొడ్యూసర్ : ప్రవల్లిక యోగి
లైన్ ప్రొడ్యూసర్ : T. బద్రి నాధ్ రెడ్డి
బ్యానర్ : అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్
డీవోపీ : ఎం. ఎన్ బాల్ రెడ్డి,
మ్యూజిక్ : గౌర హరి
ఎడిటింగ్ : M R వర్మా
ఫైట్స్ : పృథ్వి, బింబిసారా రామకృష్ణ,
ఆర్ట్ : సురేష్ భీమగని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : A.దుర్గేష్
కో – డైరెక్టర్ : U. కృష్ణ కిషోర్
పబ్లిసిటీ డిజైన్: అనిల్ – భాను
పీఆర్వో : తేజస్వి సజ్జా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here