డాక్టర్ పి. ప్రకాశ్ కు పీహెచ్ డీ అవార్డు

0
4
PhD Award to Dr. P. Prakash
PhD Award to Dr. P. Prakash

మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరు మండల కేంద్రానికి చెందిన ప్రతాపని కృష్ణమూర్తి, సువర్ణం దంపతుల మూడవ కుమారుడైన ప్రతాపని ప్రకాశ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో జియాలజీ విభాగం నుండి జియాలజీలో పిహెచ్ డీ పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్ (జియోలాజీ విభాగం) మరియు యూనివర్సిటీ – సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అయిన డాక్టర్ జి. ప్రభాకర్ గారి మార్గదర్శకత్వంలో ” తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లా, రఘునాథపల్లి వాటర్షెడ్లో భూగర్భ జలాలు మరియు ఉపరితల జలనిర్వహణ కోసం ఇంటిగ్రేటెడ్ రిమోట్ సెన్సింగ్ మరియు GIS అధ్యయనాలు” అనే అంశం పై డాక్టర్ ప్రకాశ్ పరిశోధన చేశారు. ఆయన జలవనరులు మరియు భూగర్భశాస్త్ర రంగాలలో రిమోట్ సెన్సింగ్ మరియు GIS టెక్నాలజీలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. గతంలో, ఆయన కర్ణాటకలో ప్రపంచ బ్యాంక్ నిధులతో నడిచే “జల్ నిర్మల్ ప్రాజెక్టు”లో మరియు “రాజీవ్ గాంధీ త్రాగునీటి మిషన్” ప్రాజెక్టు( తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్)లలో పని చేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వ ప్రణాళిక విభాగం కింద తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ (TGRAC)లో సైంటిఫిక్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. పిహెచ్ డీ పట్టా పొందిన సందర్భంగా ఆయన గైడ్ – జి. ప్రభాకర్ గారికి, జియాలజి విభాగం సిబ్బంది (ఉస్మానియా విశ్వవిద్యాలయం), TGRAC సిబ్బంది, కుటుంబసభ్యులు, స్నేహితులు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here