UGC NET ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయడం సిగ్గుచేటు

NEET పరీక్ష లో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి

UGC CSIR పరీక్ష పోస్ట్ పోన్ చేయడంలోనే ఎన్.టి.ఏ అసమర్థత కనిపిస్తున్నది

బాలసముద్రం చౌరస్తా వద్ద విద్యార్థులతో కలిసి ఎన్.టి. ఏ ను రద్దు చేయాలని శనివారం ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్ మంద శ్రీకాంత్ మాట్లాడుతూ కనీసం నీట్ ఎక్సమ్ ఫలితాలు విడుదలై 20 రోజులు కాకముందే పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్టు బయటపడిందని అదే తరహాలో యుజిసి నెట్ ఎగ్జామ్ లో కూడా ఇలాంటి అవకతవకలు జరిగాయని ముందుగానే ఏంటి ఏ నెట్ ఎగ్జాం రద్దు చేసింది దీంతో పాటుగా సిఎస్ఐఆర్ ఎగ్జామ్ కూడా పోస్ట్ ఫోన్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇంతగణం కేంద్రం నిర్వహించేటువంటి పరీక్షల్లో అవకతవకలు కుంభకోణాలు బయటపడడం మోడీ ప్రభుత్వానికే సాధ్యమని ఎద్దేవా చేశారు వెంటనే ఏ పరీక్షను సక్రమంగా నిర్వహించలేనటువంటి ఎన్టిఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అలాగే నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పోటీ పరీక్షలను నిర్వహించాలని, మెడికల్ అడ్మిషన్ల నియామకం రాష్ట్ర ప్రభుత్వాలకే కేటాయించాలని విద్యారంగంలో మునుపెన్నడూ లేనంత అవకతవకలు కుంభకోణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చరణ్ అర్జున్ రామ్ నందిని కళ్యాన్ రమ్య ప్రవళిక అనూష సందీప్ చరణ్ రాజకుమార్ నితిన్ వైష్ణవి తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు